Mamata Banerjee: ‘మీకో న్యాయం.. మరొకరికి ఇంకో న్యాయమా.?’.. దీదీ కపట నాటకం ఆడుతోందంటూ విమర్శలు..

Mamata Banerjee: లీడర్లు చేస్తోన్న వ్యాఖ్యలు పార్టీ అధినేతలకు తల నొప్పి తెచ్చిపెడుతున్నాయి. అవగాహన లోపమో, తొందరపాటే కానీ కొందరు నాయకులు చేస్తోన్న వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీయడమే కాకుండా పార్టీ ఇమేజ్‌ను...

Mamata Banerjee: 'మీకో న్యాయం.. మరొకరికి ఇంకో న్యాయమా.?'.. దీదీ కపట నాటకం ఆడుతోందంటూ విమర్శలు..
Follow us

|

Updated on: Jul 06, 2022 | 9:27 PM

Mamata Banerjee: లీడర్లు చేస్తోన్న వ్యాఖ్యలు పార్టీ అధినేతలకు తల నొప్పి తెచ్చిపెడుతున్నాయి. అవగాహన లోపమో, తొందరపాటే కానీ కొందరు నాయకులు చేస్తోన్న వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీయడమే కాకుండా పార్టీ ఇమేజ్‌ను సైతం డ్యామేజ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నాయకుల వ్యాఖ్యలకు పార్టీల అధినేతలు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు ఎంతటి చర్చకు దారి తీశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలతో విదేశాల్లోనూ నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో వెంటనే అలర్ట్‌ అయిన బీజేపీ పార్టీ నుపుర్‌ శర్మను పార్టీ నుంచి తొలగిస్తూ నిర్ణం తీసుకున్నారు. ఇక నుపుర్‌ శర్మ వ్యాఖ్యలపై ఇతర దేశాలతో పాటు దేశంలోని ఇతర పార్టీల నేతలు ఫైర్‌ అయిన విషయం తెలిసిందే.

వీరిలో వెస్ట్‌ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ముందు వరుసలో ఉన్నారు. నూపుర్‌ శర్మ వ్యాఖ్యలపై దీదీ తీవ్ర స్థాయిలో స్పందించారు. నుపుర్‌ శర్మ వ్యాఖ్యలు కుట్రలోనే భాగమని, ఇది ముమ్మాటికీ బీజేపీ విభజన విధానమని తీవ్రంగా స్పందించారు. అయితే ఇప్పుడు అదే పరిస్థితి మమతా బెనర్జీకి కూడా వచ్చింది. తాజాగా తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా కాళీ మాతపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన దృష్టిలో కాళీమాత మాంసం తినే, మద్యం తాగే వ్యక్తి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై తమ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని టీఎంసీ ట్వీట్ చేసింది. మహువా చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొంది. దీనికి ప్రతి స్పందనగా మెయిత్రా పార్టీ అధికారిక ట్విట్టర్‌ హాండిల్‌ను అన్‌ఫాలో చేశారు. దీంతో బీజేపీ నేతలు టీఎంసీ పై విమర్శలు గుప్పించారు, మహువా మెయిత్రా వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని టీఎంసీ ఎలా అంటుందని విమర్శిస్తున్నారు.

మహువా మొయిత్రాను పార్టీ నుంచి కొన్ని రోజులు సస్పెండ్ అయినా చేయాలి లేదా బహిష్కరించాలని డిమాండ్ చేశారు. మహువాను నుపూర్ శర్మతో పోలుస్తూ బీజేపీ అటాక్‌కు దిగింది. ఇది కూడా టీఎమ్‌సీ పార్టీ విభజన కుట్రంగా పేర్కొంటారా.? అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. మీకో న్యాయం, ఇతరులకు మరో న్యాయమా అంటున్నారు. నుపూర్ శర్మను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేసిన మమతా బెనర్జీ.. మహువా మొయిత్రా వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదంటూ ఖండిస్తున్నారు. మెయిత్రాకు కూడా నుపూర్ శర్మకు వేసిన శిక్షే వర్తిస్తుంది కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ హాస్యాస్పదమైన విషయమేంటంటే.. మమతా బెనర్జీ ఆమె చెప్పే విషయాలను పాటించరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నుపూర్ శర్మ వ్యాఖ్యలు బీజేపీ కుట్రేనని మమతా చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటే.. మొయిత్రా వ్యాఖ్యలపై కూడా స్పందించాలనే వాదనలు వినిపిస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?
ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?
నెటిజన్లను ఊరిస్తున్న బ్లూక‌ల‌ర్ ఘీ రైస్.. తయారీ వీడియో వైరల్
నెటిజన్లను ఊరిస్తున్న బ్లూక‌ల‌ర్ ఘీ రైస్.. తయారీ వీడియో వైరల్
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే
ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే
ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..
హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..
రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?
రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.