ఎన్నార్సీతో ప్రాణాలు పోతున్నాయి… బీజేపీకి దీదీ స్ట్రాంగ్ కౌంటర్

దేశమంతటా ఎన్నార్సీని అమలు చేసేందుకు రెడీ అవుతున్న కేంద్ర ప్రభుత్వంపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. అసోం ఒప్పందం కారణంగానే అక్కడ ఎన్నార్సీ అమలు జరిపారని, పశ్చిమ బెంగాల్‌లో అలజడులు సృష్టించేందుకు బీజేపీ రెడీ అవుతోందని ఆరోపించారు. సోమవారం ఇక్కడ జరిగిన కార్మిక సంఘాల సభలో ఆమె ప్రసంగించారు. రాష్ట్రంలో ఎన్నార్సీ ప్రక్రియను అనుమతించేది లేదని దీదీ తేల్చి చెప్పారు. కేవలం బెంగాల్‌లో మాత్రమే కాదు, మిగిలిన ఏ రాష్ట్రాల్లోనూ అమలు […]

ఎన్నార్సీతో  ప్రాణాలు పోతున్నాయి... బీజేపీకి దీదీ  స్ట్రాంగ్ కౌంటర్
Follow us

| Edited By:

Updated on: Sep 24, 2019 | 1:33 AM

దేశమంతటా ఎన్నార్సీని అమలు చేసేందుకు రెడీ అవుతున్న కేంద్ర ప్రభుత్వంపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. అసోం ఒప్పందం కారణంగానే అక్కడ ఎన్నార్సీ అమలు జరిపారని, పశ్చిమ బెంగాల్‌లో అలజడులు సృష్టించేందుకు బీజేపీ రెడీ అవుతోందని ఆరోపించారు. సోమవారం ఇక్కడ జరిగిన కార్మిక సంఘాల సభలో ఆమె ప్రసంగించారు. రాష్ట్రంలో ఎన్నార్సీ ప్రక్రియను అనుమతించేది లేదని దీదీ తేల్చి చెప్పారు. కేవలం బెంగాల్‌లో మాత్రమే కాదు, మిగిలిన ఏ రాష్ట్రాల్లోనూ అమలు కాకుండా చేస్తామన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఎన్నార్సీని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. దీన్ని అమలు చేయాలని గట్టి పట్టుదలతో ఉన్న బీజేపీకి ఆ పార్టీ అధికారంలో ఉన్న త్రిపురలో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ పేరు కూడా ఈ జాబితాలో ఉండదన్న విషయం తెలియడం వల్లే బీజేపీ అక్కడ ఎన్‌ఆర్‌సీ ఊసు ఎత్తడం లేదని ఆమె తెలిపారు.

బెంగాల్‌లో ఎన్నార్సీ అమలు చేస్తారన్న భయంతో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారని, తమ రాష్ట్రంలో బీజేపీ భయోత్పాతాన్ని సృష్టించాలని చూడటం సిగ్గుచేటని మండిపడ్డారు. దేశంలో ఒకపక్క నిరుద్యోగం పెరిగిపోతున్నా.. ఆర్థిక మాంద్యం తీవ్రమవుతున్నా బీజేపీకి ఏమాత్రం పట్టడం లేదని, తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడమే ధ్యేయంగా ఆ పార్టీ పనిచేస్తోందని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, మూసివేతలకు నిరసనగా వచ్చే నెల 18న ర్యాలీ నిర్వహిస్తామని, అందులో తానే స్వయంగా పాల్గొంటానని మమతా వెల్లడించారు. ఈనెల 26, 27 తేదీల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోల్‌కతా నగరంలో నిరసన ర్యాలీలు నిర్వహిస్తామని ఆమె అన్నారు.

81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!