దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని బవానా పారిశ్రామిక ప్రాంతంలో కార్డ్‌బోర్డ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. వెంటనే 14 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు ఘటనాస్థలికి చేరుకున్నారు. భారీగా చెలరేగుతున్న మంటలను ఫైర్ ఇంజన్లతో ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నామని.. మంటలు ప్రస్తుతం అదుపులోకి వచ్చాయని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదని.. షార్ట్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:16 am, Sun, 10 May 20
దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని బవానా పారిశ్రామిక ప్రాంతంలో కార్డ్‌బోర్డ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. వెంటనే 14 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు ఘటనాస్థలికి చేరుకున్నారు. భారీగా చెలరేగుతున్న మంటలను ఫైర్ ఇంజన్లతో ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నామని.. మంటలు ప్రస్తుతం అదుపులోకి వచ్చాయని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదని.. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.