మహారాష్ట్రలో ఫడ్నవీస్ బల నిరూపణ ? గవర్నర్ ఆహ్వానం

మహారాష్ట్రలో అధికార పంపిణీపై బీజేపీ-శివసేన ఇప్పటికీ పేచీ పడుతుండగా.. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ బీజేపీ వైపు మొగ్గారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఈ పార్టీని కోరారు. అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవలసిందిగా మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కి సూచించారు. దీనిపై చర్చించేందుకు ఈ పార్టీ కోర్ గ్రూప్ ఆదివారం సమావేశమవుతోంది. మరోవైపు-శివసేన తమ ఎమ్మెల్యేలందరినీ ముంబై శివార్లలోని మధ్ ఐలాండ్ రిసార్టుకు తరలించింది. వారిని బీజేపీ ప్రలోభ పెట్టకుండా చూసేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. ఈ […]

మహారాష్ట్రలో ఫడ్నవీస్ బల నిరూపణ ? గవర్నర్ ఆహ్వానం
Follow us

|

Updated on: Nov 10, 2019 | 11:13 AM

మహారాష్ట్రలో అధికార పంపిణీపై బీజేపీ-శివసేన ఇప్పటికీ పేచీ పడుతుండగా.. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ బీజేపీ వైపు మొగ్గారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఈ పార్టీని కోరారు. అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవలసిందిగా మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కి సూచించారు. దీనిపై చర్చించేందుకు ఈ పార్టీ కోర్ గ్రూప్ ఆదివారం సమావేశమవుతోంది. మరోవైపు-శివసేన తమ ఎమ్మెల్యేలందరినీ ముంబై శివార్లలోని మధ్ ఐలాండ్ రిసార్టుకు తరలించింది. వారిని బీజేపీ ప్రలోభ పెట్టకుండా చూసేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. ఈ రిసార్టులో ఆదిత్య థాక్రే కూడా వీరి వెంటే ఉన్నారు. బీజేపీ 105, సేన 56 సీట్లను గెలుచుకున్న సంగతి విదితమే. అయితే పేచీ అధికార పంపిణీపైనే వచ్చింది. చెరి సగం అధికారాన్ని [పంచుకోవాలని సేన కోరుతుండగా ఇందుకు బీజేపీ ససేమిరా అంటోంది. ఈ తాజా పరిణామాలను ఎన్సీపీ నిశితంగా గమనిస్తోంది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పక్షంలో శాసన సభలో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం పడిపోయిన పక్షంలో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా.. ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తాము యత్నిస్తామని ఆయన చెప్పారు. బీజేపీ సర్కార్ ని పడగొట్టడానికి శివసేన అసెంబ్లీలో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి ప్రయత్నిస్తుందేమో చూస్తామన్నారు. ఈ నెల 12 న తమ పార్టీ శాశన సభ్యులంతా సమావేశమవుతారని భవిష్యత్ కార్యాచరణను నిర్దేశించుకుంటారని ఆయన పేర్కొన్నారు. ఆ సమావేశానికి సీనియర్ నేత శరద్ పవార్ కూడా హాజరవుతారని మాలిక్ వెల్లడించారు.

ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?