Uddhav Thackeray: సీఎంగా ఉద్ధవ్‌ థాక్రే రాజీనామా.. క్లైమాక్స్‌కి చేరిన మహారాష్ట్ర సీన్..

Uddhav Thackeray Resigns: ఒకవేళ విశ్వాసపరీక్షకు వెళ్లాల్సి వస్తే పదవి నుంచి తప్పుకుంటానన్న ఉద్ధవ్‌ అదే పని చేశారు. ఉద్ధవ్ రాజీనామాతో బలపరీక్ష వ్యవహారం ముగిసినట్లే. ఇక వాట్‌నెక్ట్స్ అన్నదే తేలాలి.

Uddhav Thackeray: సీఎంగా ఉద్ధవ్‌ థాక్రే రాజీనామా.. క్లైమాక్స్‌కి చేరిన మహారాష్ట్ర సీన్..
Uddhav Thackeray
Follow us

|

Updated on: Jun 29, 2022 | 10:25 PM

మహారాష్ట్ర సీన్ క్లైమాక్స్‌కి వచ్చేసింది. సీఎంగా ఉద్ధవ్‌ థాక్రే రాజీనామా చేశారు. ఒకవేళ విశ్వాసపరీక్షకు వెళ్లాల్సి వస్తే పదవి నుంచి తప్పుకుంటానన్న ఉద్ధవ్‌ అదే పని చేశారు. ఉద్ధవ్ రాజీనామాతో బలపరీక్ష వ్యవహారం ముగిసినట్లే. ఇక వాట్‌నెక్ట్స్ అన్నదే తేలాలి. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తన హయాంలో తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావించారు. తాము చేసిన మంచి పనులు గుర్తుంచుకోవాలని అన్నారు. నగరాల పేర్లను మార్చాలని నిర్ణయించుకున్నామన్నారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే సోనియా గాంధీ, శరద్ పవార్‌లపై ప్రశంసలు కురిపించారు. గవర్నర్‌కి కూడా ధన్యవాదాలు. ప్రజాస్వామ్యాన్ని అనుసరించాలి. మేము దానిని అనుసరిస్తాము. బాలా సాహెబ్ ఆశయాలను నెరవేర్చామని ఉద్ధవ్ ఠాక్రే చెప్పుకొచ్చారు. శివాజీ మహారాజ్ వారసత్వాన్ని కొనసాగిస్తామని వ్యాఖ్యానించారు.

కేబినెట్‌లో ఇచ్చిన సూచనలు..

మహారాష్ట్ర కేబినెట్‌ సమావేశం అనంతరం ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. తన వల్ల ఏదైనా తప్పు జరిగితే క్షమించండని ఉద్ధవ్ ఠాక్రే మంత్రులతో అన్నారు. తన వాళ్లే తనను మోసం చేశారని, కేబినెట్ భేటీ తర్వాత మీడియాకు నమస్కరించి ఉద్ధవ్‌ సచివాలయం నుంచి వెళ్లిపోయారు. ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలోనే ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా సూచనప్రాయంగా వెల్లడించారు. రెండున్నరేళ్లుగా మీరు నాకు మద్దతుగా నిలిచారని సమావేశం అనంతరం ఆయన అన్నారు.  తన వల్ల ఏదైనా తప్పు జరిగితే క్షమించండని ఉద్ధవ్ ఠాక్రే మంత్రులతో అన్నారు. మంత్రాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి ఛత్రపతి శివాజీ, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు నమస్కరించారు.

మంత్రివర్గ సమావేశంలో సహచరులకు కృతజ్ఞతలు తెలిపిన అనంతరం ఉద్ధవ్ ఠాక్రే సీఎం కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయంలోని సిబ్బంది అందరినీ పిలిపించి కృతజ్ఞతలు తెలిపారు. గత రెండున్నరేళ్లలో సహకార స్ఫూర్తిని వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి కార్యాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

జాతీయ వార్తల కోసం