Maharashtra: అధికారమే శివసేన కోసం పుట్టింది.. ఉద్ధవ్‌కు ఇలానే వెన్నుపోటు పొడిచారు: సంజయ్ రౌత్

ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో తామంతా భావోద్వేగానికి గురయ్యామని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఉద్ధవ్ ఠాక్రేపై అందరికీ నమ్మకం ఉంది. అన్ని కులాలు, మతాల వారు ఆయనకు మద్దతు పలుకుతున్నారన్నారు.

Maharashtra: అధికారమే శివసేన కోసం పుట్టింది.. ఉద్ధవ్‌కు ఇలానే వెన్నుపోటు పొడిచారు: సంజయ్ రౌత్
Maharashtra Political Crisi
Follow us

|

Updated on: Jun 30, 2022 | 1:17 PM

Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం చివరి దశకు చేరుకుంది. బలపరీక్షకు గవర్నర్‌ భగత్‌సింఘ్ కోష్యారీ ఆదేశించడం, ఈ విషయంలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో.. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే (Uddhav Thackeray) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలడంతో.. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే, ఎమ్మెల్యేలతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపారు. దీంతోపాటు బీజేపీ ఎమ్మెల్యేలతో మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చర్చలు జరిపుతున్నారు. కాగా.. తాజా పరిణామాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) స్పందించారు. ప్రభుత్వం కూలడానికి కారణమైన తిరుగుబాటు నాయకులపై సంజయ్ మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో తామంతా భావోద్వేగానికి గురయ్యామని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఉద్ధవ్ ఠాక్రేపై అందరికీ నమ్మకం ఉంది. అన్ని కులాలు, మతాల వారు ఆయనకు మద్దతు పలుకుతున్నారన్నారు. సోనియా గాంధీ, శరద్ పవార్‌లకు కూడా ఉద్ధవ్‌పై నమ్మకం ఉందని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ పేర్కొన్నారు. శివసేన అధికారం కోసం పుట్టలేదు, అధికారమే శివసేన కోసం పుట్టింది. ఇది బాలాసాహెబ్ ఠాక్రే ఎల్లప్పుడూ చెప్పే నినాదం అని పేర్కొన్నారు. తాము ఇక్కడితో పోరాటాన్ని ఆపమని.. ప్రజల్లోకి వెళ్లి మరింత పనిచేసి మరోసారి సొంతంగా అధికారంలోకి వస్తామని సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం సరికాదన్నారని.. వెంటనే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారని తెలిపారు. నైతిక విలువలున్న నాయకుడు ఆయనేనంటూ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. వారంతా శివసేన చీఫ్ ఉద్ధవ్‌ ఠాక్రేకు వెన్నుపోటు పొడిచారంటూ ఈ సందర్భంగా అసమ్మతి ఎమ్మెల్యేలపై ధ్వజమెత్తారు. ఈ మేరకు ఓ చిత్రాన్ని షేర్ చేసి.. ‘ఇప్పుడు రాష్ట్రంలో సరిగ్గా ఇదే జరిగింది’ అంటూ ట్విట్టర్లో రాశారు.

రేపు ఈడీ విచారణకు సంజయ్ రౌత్..

ఇదిలాఉంటే.. ఈ సమయంలోనే ఈడీ సంజయ్ రౌత్‌కు నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. ముంబయిలోని గోరెగావ్‌ పాత్రచాల్‌ భూ కుంభకోణం, ఇతర ఆర్థిక వ్యవహారాల్లో చోటుచేసుకున్న నగదు అక్రమ చలామణీకి సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ సమన్లు జారీ చేసింది. సంజయ్‌ రౌత్‌ భార్య, ఆయన స్నేహితుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ జులై 1వ తేదీన విచారణకు రావాలని నోటీసులిచ్చింది. ఈ సమన్లపై సంజయ్ రౌత్ స్పందిస్తూ.. తాను రేపు ఈడీ కార్యాలయానికి వెళ్తున్నానంటూ తెలిపారు.

జాతీయ వార్తల కోసం