మహారాష్ట్ర రాజకీయాలు కోర్టుకు చేరబోతున్నాయి. రెబల్ ఎమ్మెల్యేలపై రాజకీయ పోరాటం కాదు.. న్యాయపోరాటం ప్రారంభించినట్టు తెలిపారు శివసేన నేతలు . ఇప్పటివరకు ఏపార్టీలో కూడా రెబల్ ఎమ్మెల్యేలు విలీనం కాకపోవడంతో మూడింట రెండొంతుల అంశం వర్తించదని , రెబల్స్‌పై అనర్హత వేటు ఖాయమని శివసేన ఎంపీ అరవింద్ సావంత్ . రెబల్ ఎమ్మెల్యేలపై మరోసారి నిప్పులు చెరిగారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. వాళ్లు బతికున్న శవాలతో పోల్చారు. ఆత్మను చంపుకున్నారని విమర్శించారు. గౌహతి లోని కామాఖ్య ఆలయంలో దున్నపోతులను బలిఇస్తారని , రెబల్ ఎమ్మెల్యేల పరిస్థితి అలా ఉందన్నారు.
రెబల్ ఎమ్మెల్యేల తీరుపై విరుచుకుపడ్డారు మంత్రి ఆదిత్యా థాక్రే. ద్రోహులు పార్టీని విడిచివెళ్లడమే మంచిదన్నారు. దమ్ముంటే రెబల్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో గెలవాలని సవాల్ విసిరారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రెబల్స్‌ను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వబోమని శపథం చేశారు ఆదిత్యా థాక్రే.
మరోవైపు రెబల్ ఎమ్మెల్యేలు బస చేసిన గౌహతి వెళ్లేందుకు ఉద్ధవ్‌థాక్రే వర్గం రెడీ అయ్యింది. రాడిసన్ బ్లూ హోటల్లో 20 గదులు కావాలని ఉద్ధవ్‌థాక్రే వర్గం ఈమెయిల్ పంపించింది. ఇదే హోటల్లో బస చేశారు షిండే వర్గం ఎమ్మెల్యేలు.
శివసేనలో రెండు గ్రూపుల మధ్య మైండ్‌గేమ్ జోరుగా సాగుతోంది. 20 మంది ఎమ్మెల్యేలతో ఉద్ధవ్‌థాక్రే టచ్‌లో ఉన్నారని శివసేన నేతలు చెబుతున్నారు. బీజేపీలో విలీనాన్ని వాళ్లు వ్యతిరేకిస్తునట్టు చెప్పారు. ఇదే సమంయంలో ఉద్ధవ్థాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సూరత్‌లో నుంచి గౌహతి చేరుకున్నారు మంత్రి ఉదయ్ సామంత్ . రెబల్ క్యాంప్‌తో ఆయన జతకలిపారు.
రెబల్ ఎమ్మెల్యేల ఇంటి దగ్గర తగిన భద్రత కల్పించాలని ముంబై పోలీసు కమిషనర్‌కు లేఖ రాశారు మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారి. శివసేన రెబల్ ఎమ్మెల్యే కుటుంబాలకు కేంద్రం వై కేటగిరి భద్రతను కేటాయించింది. శివసేన కార్యకర్తలు దాడి చేసే అవకాశం ఉండడంతో 15 మంది రెబల్ ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గర సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రతను కల్పించారు.
మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. డిప్యూటీ స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని శివసేన రెబల్స్ నిర్ణయించారు. షిండే వర్గం ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును డిప్యూటీ స్పీకర్ తిరస్కరించారు . రెబల్స్‌కు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన గడువు రేపటితో ముగుస్తుంది. తమకు మరింత సమయం ఇవ్వాలన్న విజ్ఞప్తిని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడంపై కూడా షిండే వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమదే అసలైన శివసేన అంటూ షిండే వర్గం వాదిస్తోంది.
గౌహతి హోటల్లో శివసేన రెబల్ ఎమ్మెల్యే నరేంద్ర భోండేకర్ బర్త్‌డే వేడుకలకు జరిగాయి. భోండేకర్‌కు కేక్ తినిపించిన బర్త్‌డే విషెస్ తెలిపారు ఏక్‌నాథ్‌షిండే. మరోవైపు రెబల్స్‌కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా శివసేన కార్యకర్తలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. .ముంబైలో బైక్ ర్యాలీ చేపట్టారు. షిండేకు వ్యతిరేకంగా జుతా మారో ర్యాలీ కూడా నిర్వహించారు.