Maharashtra Political Crisis: మహారాష్ట్ర సీఎంగా షిండే, డిప్యూటీ సీఎంగా ఫడణవీస్‌ ప్రమాణ స్వీకారం..

మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఏకనాథ్ షిండేతో ప్రమాణ స్వీకారం చేయించారు. అదే సమయంలో ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

Maharashtra Political Crisis: మహారాష్ట్ర సీఎంగా షిండే, డిప్యూటీ సీఎంగా ఫడణవీస్‌ ప్రమాణ స్వీకారం..
Maharashtra
Sanjay Kasula

| Edited By: Ram Naramaneni

Jun 30, 2022 | 8:53 PM

మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ షిండే(Eknath Shinde) ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా ఏక్‌నాథ్‌ షిండే ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌(Devendra Fadnavis) ప్రమాణం చేశారు. గవర్నర్ భగత్‌ సింగ్ కొశ్యారి.. ఇద్దరితో ప్రమాణం చేయించారు. బీజేపీ(BJP) మద్దతుతో మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వం కొలువుదీరింది. నాటకీయ పరిణామాల మధ్య ఉద్ధవ్ సీఎంగా నిన్న రాజీనామా చేశారు. అనంతరం నిన్నటి నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని అంతా ఊహించారు. అయితే అనూహ్యంగా ఏక్‌నాథ్‌ షిండే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రమాణం చేశారు. ఓ దశలో మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ భాగస్వామి కాదన్న చర్చ నడిచింది. చివరకు ఫడ్నవీస్‌ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టేందుకు జాతీయ నేతలు ఒప్పించారు. దీంతో మరోసారి మహారాష్ట్రలో సంకీర్ణ సర్కారు కొలువుదీరింది.

శివసేన నుంచి ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో మొదలైన సంక్షోభం తీవ్రస్థాయిలో కొనసాగడంతో బుధవారం ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామా చేశారు. దీంతో 2019లో శివసేన-కాంగ్రెస్‌-ఎన్సీపీలు కలిసి ఏర్పాటు చేసిన మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. దీంతో గురువారం బీజేపీ – శివసేన రెబల్‌ వర్గం ఎమ్మెల్యేలు కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో గురువారం రెండు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉద్ధవ్‌ రాజీనామాతో తదుపరి సీఎంగా దేవేంద్ర ఫడణవీస్‌ అవుతారని.. శివసేన తిరుగుబాటు నేత శిందేకు డిప్యూటీ సీఎం ఇస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, ఈ సాయంత్రం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాను సీఎం పదవి చేపట్టడంలేదని, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండనన్న ఫడణవీస్‌.. కొత్త సీఎం ఏక్‌నాథ్‌ శిందే అని ఈ సాయంత్రం ప్రకటించారు. అయితే, ఫడణవీస్‌ అలా ప్రకటించిన మూడు గంటల వ్యవధిలోనే బీజేపీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఫడణవీస్‌ ప్రభుత్వ ఏర్పాటులో భాగం కావాలని.. ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాలంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కోరారు. దీంతో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణస్వీకారం చేశారు.

అంతకుముందు రోజు అంటే బుధవారం ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఈరోజు బీజేపీ నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ ముందు ప్రభుత్వ ఏర్పాటుకు తమ వాదనను వినిపించారు. గవర్నర్‌తో భేటీ అనంతరం రాజ్‌భవన్‌లో దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు.

జాతీయ వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu