Maharashtra Politics: ఏ క్షణంలోనైనా కుప్పకూలే ఛాన్స్.. బుజ్జగింపులకు దిగిరిన రెబల్‌ లీడర్..

Maharashtra Political Crisis: మంత్రి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలో శివసేన ఎమ్మెల్యేలు సూరత్‌లో క్యాంప్‌ పెట్టారు. లీ మెరిడియన్‌ ఫైవ్‌స్టార్‌ హోటళ్లో శివసేన రెబల్‌ క్యాంప్‌ నడుస్తోంది. మహారాష్ట్ర రాజకీయాలు క్షణం క్షణం మారిపోతున్నాయి.

Maharashtra Politics: ఏ క్షణంలోనైనా కుప్పకూలే ఛాన్స్.. బుజ్జగింపులకు దిగిరిన రెబల్‌ లీడర్..
Maharashtra Political Crisi
Follow us

|

Updated on: Jun 21, 2022 | 8:05 PM

మహారాష్ట్రలో మహావికాస్‌ అఘాడి ‌ సర్కార్‌ ఏ క్షణంలోనైనా కుప్పకూలే అవకాశం ఉంది. సీఎం ఉద్దవ్‌థాక్రేకు షాకిచ్చిన 35 మంది శివసేన ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టేందుకు రెడీ అయ్యారు. మంత్రి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలో శివసేన ఎమ్మెల్యేలు సూరత్‌లో క్యాంప్‌ పెట్టారు. లీ మెరిడియన్‌ ఫైవ్‌స్టార్‌ హోటళ్లో శివసేన రెబల్‌ క్యాంప్‌ నడుస్తోంది. మహారాష్ట్ర రాజకీయాలు క్షణం క్షణం మారిపోతున్నాయి. పార్టీపై తిరుగుబాటు చేసిన మంత్రి ఏక్‌నాథ్‌షిండేకు నచ్చచెప్పడానికి శివసేన నేతలు ప్రయత్నిస్తున్నారు. సీఎం ఉద్దవ్‌థాక్రే సందేశంతో సూరత్‌ చేరుకున్నారు శివసేన నేతలు. అయితే సయోధ్యకు ఏక్‌నాథ్‌షిండే షరతులు పెట్టినట్టు తెలుస్తోంది. బీజేపీతో కలిసి మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని షిండే కోరినట్టు చెబుతున్నారు. ఎన్సీపీ , కాంగ్రెస్‌ను దూరం పెట్టాలని డిమాండ్‌ చేసినట్టు చెబుతున్నారు. అయితే ఈ డిమాండ్‌ను ఉద్దవ్‌ థాక్రే తోసిపుచ్చారని సమాచారం.

తాను బాలథాక్రే ప్రియశిష్యుడినని , పార్టీకి ద్రోహం చేసే ఉద్దేశ్యం లేదని ట్వీట్‌ చేశారు ఏక్‌నాథ్‌ షిండే. అయినా అటు అసెంబ్లీలో శివసేన పక్ష నేత పదవి నుంచి ఏక్‌నాథ్‌షిండేను తొలగించారు ఉద్దవ్‌థాక్రే. మరోవైపు పార్టీకి ద్రోహం చేసిన ఏక్‌నాథ్‌షిండేను వెంటనే బహిష్కరించాలని శివసైనికులు డిమాండ్‌ చేశారు. ఉద్దవ్‌థాక్రే నివాసానికి భారీగా శివసైనికులు చేరుకున్నారు.

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌. అటు దిద్దుబాటు చర్యలు చేపట్టింది కాంగ్రెస్‌ పార్టీ. సంక్షోభం పరిష్కారం కోసం సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ను రంగంలోకి దింపింది. కమల్‌నాథ్‌ మహారాష్ట్ర ఏఐసీసీ పరిశీలకుడిగా నియమిస్తున్నట్టు ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

లెజిస్లేచర్ పార్టీ నేత పదవి నుంచి ఏకనాథ్ షిండేను తొలగించారు

అంతకుముందు శివసేన ఎమ్మెల్యేలతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మొత్తం 18 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని సీఎం ఉద్ధవ్ ఠాక్రే సమావేశంలో విశ్వాసం వ్యక్తం చేశారు. కోపంతో ఉన్నవారు సంబరాలు చేసుకుంటారు. మరోవైపు, ఏక్‌నాథ్ షిండేపై శివసేన కూడా పెద్ద ఎత్తున చర్య తీసుకుంది. శివసేన ఆయనను లెజిస్లేచర్ పార్టీ నేత పదవి నుంచి తప్పించింది. దీంతో పాటు అజయ్ చౌదరిని శాసనసభా పక్ష నేతగా శివసేన నియమించింది.

మహా నెంబర్‌ గేమ్ ఇలా ఉంది.. మొత్తం సభ్యుల సంఖ్య- 287 (288)

– మాజిక్‌ ఫిగర్ – 144 మహావికాస్‌ అఘాడి (MVA) – 169 బీజేపీ కూటమి( NDA) – 113 ఇతరులు – 05

రెబల్స్‌ 26 ——————– పార్టీల వారీగా ప్రస్తుత బలాబలాలు బీజేపీ+ 107 శివసేన 55 ఎన్సీపీ 53 కాంగ్రెస్ 44 ఇండిపెండెంట్లు 13 చిన్నపార్టీలు 07 —————–

ఏక్‌నాథ్‌షిండే డిమాండ్‌తో.. శివసేన ( 55) + బీజేపీ (107) = 162

జాతీయ వార్తల కోసం

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..