Suspicious Boat: సముద్ర తీరంలో కనిపించిన అనుమానాస్పద పడవ మిస్టరీ వీడింది.. వివరాలివే..

Maharashtra: మహారాష్ట్రలోని రాయగడ జిల్లా హరిహరేశ్వర్ సముద్ర తీర ప్రాంతంలో మిస్టరీ బోట్ కొద్దిసేపు తీవ్ర కలకలం రేపింది. మొదట ఇది స్థానిక మత్స్యకారులదని భావించగా.. అది సంద్రంలో తేలుతూ ఎంతసేపటికి తీరానికి చేరుకోకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి.

Suspicious Boat: సముద్ర తీరంలో కనిపించిన అనుమానాస్పద పడవ మిస్టరీ వీడింది.. వివరాలివే..
Devendra Fadnavis
Follow us

|

Updated on: Aug 18, 2022 | 5:43 PM

Maharashtra: మహారాష్ట్రలోని రాయగడ జిల్లా హరిహరేశ్వర్ సముద్ర తీర ప్రాంతంలో మిస్టరీ బోట్ కొద్దిసేపు తీవ్ర కలకలం రేపింది. మొదట ఇది స్థానిక మత్స్యకారులదని భావించగా.. అది సంద్రంలో తేలుతూ ఎంతసేపటికి తీరానికి చేరుకోకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఈ బోట్‌ ఎవరిది ? ఉగ్రవాదులు మరోసారి ముంబై తరహా దాడులకు కుట్ర పన్నారా ? అన్న సందేహాలు తలెత్తాయి. దీనికి తోడు అనుమానాస్పద పడవలో ఏకే 47 ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభించడంతో కుట్ర వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. అయితే ఈ మిస్టరీ పడవపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. ఇది ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్‌ హాబర్ట్‌ , హానా లాండర్‌గన్‌ దంపతులకు చెందిన బోట్‌ అని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ (Devendra Fadnavis )క్లారిటీ ఇచ్చారు. మస్కట్‌ నుంచి యూరప్‌కు వెళ్తున్న ఈ నౌక జూన్‌ 26న పడవ ప్రమాదానికి గురైందని, ఇంజన్‌ ఫెయిల్‌ కావడంతో ప్రమాదంలో చిక్కుకుందని ఫడ్నవీస్‌ తెలిపారు.

పడవలో ఉన్న ఆస్ట్రేలియా దంపతులను కొరియా నౌక రక్షించినట్టు తెలిపారు. అయితే ధ్వంసమైన పడవ మాత్రం సముద్రజలాల్లో కొట్టుకుపోయిందని , ఇప్పుడా పడవ రాయ్‌ఘడ్‌ లోని హరిహరేశ్వర్‌ తీరానికి కొట్టుకువచ్చిందని తెలిపారు. అయినప్పటికీ పండుగల సీజన్‌ కావడంతో హైఅలర్ట్‌ ప్రకటించినట్టు చెప్పారు. ఈఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు ఫడ్నవీస్‌. అయితే ప్రమాదానికి గురైన పడవలో ఆయుధాలు చెక్కుచెదరకుండా ఎందుకు ఉన్నాయో అర్థం కావడం లేదు. బోట్‌ పేరు my lady han . నెప్టూర్‌ పీటూపీ గ్రూప్‌ ఈ పడవకు సెక్యూరిటీని కల్పించింది. పడవలో లభించిన ఏకే 47 రైఫిళ్లు సెక్యూరిటీ సిబ్బందివేనని భావిస్తున్నారు. ఈ అనుమానాస్పద పడవపై ఎన్‌ఐఏ కూడా దర్యాప్తు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!