మహారాష్ట్ర రాజకీయం: గంటకో ట్విస్ట్..

మహారాష్ట్రలో రాజకీయాలు ఏ క్షణానికి ఎలా మారిపోతాయో ఎవ్వరికి అర్థం కావట్లేదు. ఇప్పుటికే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించిన నేపథ్యంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ చేతులెత్తేసింది. ఇక రెండో అతి పెద్ద పార్టీ శివసేనకు గవర్నర్ ఇచ్చిన డెడ్‌లైన్ కూడా ముగిసింది.  తాజాగా మూడవ అతి పెద్ద పార్టీగా అవతరించిన ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటుకు రావాల్సిందిగా గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఆహ్వానించారు. ఇందుకు 24 గంటల సమయాన్ని డెడ్‌లైన్‌గా ప్రకటించారు. అంటే మంగళవారం రాత్రి  8.30 […]

మహారాష్ట్ర రాజకీయం: గంటకో ట్విస్ట్..
Follow us

| Edited By:

Updated on: Nov 12, 2019 | 11:58 AM

మహారాష్ట్రలో రాజకీయాలు ఏ క్షణానికి ఎలా మారిపోతాయో ఎవ్వరికి అర్థం కావట్లేదు. ఇప్పుటికే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించిన నేపథ్యంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ చేతులెత్తేసింది. ఇక రెండో అతి పెద్ద పార్టీ శివసేనకు గవర్నర్ ఇచ్చిన డెడ్‌లైన్ కూడా ముగిసింది.  తాజాగా మూడవ అతి పెద్ద పార్టీగా అవతరించిన ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటుకు రావాల్సిందిగా గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఆహ్వానించారు. ఇందుకు 24 గంటల సమయాన్ని డెడ్‌లైన్‌గా ప్రకటించారు. అంటే మంగళవారం రాత్రి  8.30 గంటల వరకు గడువు ఉంది.

వాస్తవానికి శివసేన.. ఎన్సీపీ- కాంగ్రెస్ కూటమి సపోర్ట్‌తో ప్రభుత్వం ఏర్పాటు చేసేలా కనిపించింది. కానీ చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ మెలిక పెట్టడంతో.. పరిస్థితి చేయిదాటిపోయింది. అప్పటికీ శివసేన తమకు మరికొంత సమయం కావాలని కోరినప్పటికి గవర్నర్ తిరస్కరించారు. తాజాగా సీన్‌లోకి వచ్చిన ఎన్సీపీ రాజకీయంగా ఎటువంటి అడుగులు వేస్తుందో చూడాలి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 145 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఒకవేళ ఎన్సీపీ కూడా బలాన్ని నిరూపించుకోలేని పక్షంలో.. నాల్గవ అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తారా..? లేక రాష్ట్రపతి పాలన దిశగా ముందుకు సాగుతారా..? అన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.