Maharashtra Floor Test: అసెంబ్లీ బలపరీక్షలో నెగ్గిన షిండే సర్కార్.. 164 మంది ఎమ్మెల్యేల మద్దతు..

మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ షిండే-బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకుంది. షిండే ప్రభుత్వానికి మద్దతుగా 164 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి నిరాశే ఎదురైంది.

Maharashtra Floor Test: అసెంబ్లీ బలపరీక్షలో నెగ్గిన షిండే సర్కార్.. 164 మంది ఎమ్మెల్యేల మద్దతు..
Maharashtra CM Eknath Shinde
Follow us

|

Updated on: Jul 04, 2022 | 12:18 PM

మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ షిండే-బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకుంది. షిండే ప్రభుత్వానికి మద్దతుగా 164 ఓట్లు పోలయ్యాయి. ఉద్ధవ్ వర్గానికి చెందిన శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మహా వికాస్ అఘాడీ కూటమికి అనుకూలంగా 99 ఓట్లు వచ్చాయి. సభలో ఉన్న ముగ్గురు సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనలేదు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి నిరాశే ఎదురైంది. బలపరీక్షకు ముందు ఉద్ధవ్ వర్గానికి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు షిండే క్యాంపులో చేరారు. 106 మంది ఎమ్మెల్యేలు ఉన్న షిండే ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంది. దీంతో పాటు శివసేనకు చెందిన 40 మంది రెబల్ ఎమ్మెల్యేలను షిండే వర్గంలోకి చేరిపోయారు. మరికొందరు స్వతంత్రులు, చిన్న పార్టీలు కూడా షిండే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయి.

కలమ్నూరి శివసేన ఎమ్మెల్యే సంతోష్ బంగర్ షిండే ప్రభుత్వానికి మద్దతు పలికారు. విపక్షాల బెంచ్‌లో కూర్చున్న ఎమ్మెల్యేలు ఆయనపై వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిన్నటి వరకు శివసేన ఉద్ధవ్ ఠాక్రే శిబిరంలో ఉన్న బంగర్ నేడు అసెంబ్లీలో మెజారిటీ పరీక్ష సందర్భంగా షిండే శిబిరానికి మారారు. లోహా నుంచి శివసేన ఎమ్మెల్యే శ్యాంసుందర్ షిండే విశ్వాస పరీక్షకు ముందు ఏకనాథ్ షిండే గ్రూపులో చేరారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు షిండే వర్గానికి మారిన తర్వాత.. ఉద్ధవ్ ఠాక్రే శిబిరంలో ఇప్పుడు 14 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది.

స్పీకర్‌ ఎన్నికల్లో ఇప్పటికే బీజేపీ-షిండే వర్గం విజయం సాధించింది. బలపరీక్షలో నెగ్గిన షిండేకు అభినందనలు తెలిపారు డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌. షిండే నిజమైన శివసైనికుడని ప్రశంసించారు. మహారాష్ట్ర ప్రజలు తమపై పెట్టిన బాధ్యతలను తప్పకుండా నెరవేరుస్తామన్నారు ఫడ్నవీస్‌.

అయితే షిండే సర్కార్‌ ఎక్కువ కాలం అధికారంలో ఉండదని జోస్యం చెప్పారు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌. మహారాష్ట్రలో ఆరునెలల్లో మధ్యంతర ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలు మధ్యంతర ఎన్నికలకు సిద్దంగా ఉండాలని సూచించారు. కార్యకర్తలు ఇప్పటినుంచే ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని కోరారు.

జాతీయ వార్తల కోసం..