‘ రైతు భరోసా ‘.. మహారాష్ట్రలో రూ. 2 లక్షల రుణ మాఫీ

మహారాష్ట్రలోని రైతులకు ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారికి రూ. 2 లక్షల వరకు రుణ మాఫీ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉధ్ధవ్ థాక్రే శనివారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు ఉన్న పంట రుణాలపై ఒక్కో రైతుకు గరిష్టంగా రూ. 2 లక్షల వరకు మాఫీ చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ‘ మహాత్మా జ్యోతిరావు ఫూలే రుణ మాఫీ పథకం […]

  • Anil kumar poka
  • Publish Date - 8:10 pm, Sat, 21 December 19
' రైతు భరోసా '.. మహారాష్ట్రలో రూ. 2 లక్షల రుణ మాఫీ

మహారాష్ట్రలోని రైతులకు ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారికి రూ. 2 లక్షల వరకు రుణ మాఫీ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉధ్ధవ్ థాక్రే శనివారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు ఉన్న పంట రుణాలపై ఒక్కో రైతుకు గరిష్టంగా రూ. 2 లక్షల వరకు మాఫీ చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ‘ మహాత్మా జ్యోతిరావు ఫూలే రుణ మాఫీ పథకం ‘ గా దీన్ని వ్యవహరిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. సకాలంలో తమ రుణాలు తిరిగి చెల్లించిన రైతన్నలకు ప్రత్యేక పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. ఈ మాఫీ బేషరతుగా ఉంటుందని, ముఖ్యమంత్రి కార్యాలయం త్వరలో అన్ని వివరాలు తెలియజేస్తుందని ఆర్ధిక మంత్రి జయంత్ పాటిల్ చెప్పారు. అయితే రైతులకు పూర్తి రుణ మాఫీ చేస్తామని హామీ ఇఛ్చిన ప్రభుత్వం ఆ హామీని అమలుపరచడం లేదంటూ.. ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు.