Cabinet Expansion: ఆగస్టు 9న కేబినెట్‌ విస్తరణ.. ఎవరెవరికి చోటు దక్కుతుందంటే..!

Maharashtra Cabinet Expansion: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తన మంత్రివర్గాన్ని మంగళవారం విస్తరించనున్నారు. జూన్ 30న రాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన ఎమ్మెల్యే ఏక్‌నాథ్..

Cabinet Expansion: ఆగస్టు 9న కేబినెట్‌ విస్తరణ.. ఎవరెవరికి చోటు దక్కుతుందంటే..!
Follow us

|

Updated on: Aug 09, 2022 | 5:45 AM

Maharashtra Cabinet Expansion: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తన మంత్రివర్గాన్ని మంగళవారం విస్తరించనున్నారు. జూన్ 30న రాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆగస్టు 9న రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు జరగనున్న కార్యక్రమంలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని ఏక్‌నాథ్ షిండే సన్నిహితుల ద్వారా సమాచారం. మహారాష్ట్ర మంత్రివర్గంలోని మంత్రుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. బీజేపీ నుంచి చంద్రకాంత్ పాటిల్, సుధీర్ ముంగంటివార్, రాధాకృష్ణ విఖే పాటిల్, గిరీష్ మహాజన్, రవీంద్ర చవాన్, మంగళ్ ప్రభాత్ లోధా, కిసాన్ కథోర్, నితీష్ రాణేలకు మంత్రివర్గంలో చోటు దక్కవచ్చు. మరోవైపు, శివసేన నుంచి దాదా భూసే, సందీపన్ బుమ్రే, ఉదయ్ సమంత్, గులాబ్రావ్ పాటిల్, సంజయ్ శిర్సాత్, అనిల్ బాబర్‌లను మంత్రులుగా బాధ్యతలు చేపట్టవచ్చని తెలుస్తోంది.

ఏక్‌నాథ్‌ షిండే మంత్రివర్గంలో 12 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. అయితే మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్న వారిలో కొందరు శాసనమండలి సభ్యులు కూడా ఉన్నారు.

షిండే గత నెలలో ఏడుసార్లు ఢిల్లీకి వెళ్లారు. ప్రతి పర్యటన తర్వాత మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణలో జాప్యంపై విపక్షాల విమర్శలనూ సీఎం లక్ష్యంగా చేసుకున్నారు. తన వెంట వచ్చిన ప్రతి ఎమ్మెల్యేకు మంత్రి పదవులు ఇస్తామని షిండే హామీ ఇచ్చారని మహారాష్ట్ర అసెంబ్లీ ప్రతిపక్ష నేత అజిత్ పవార్ అన్నారు. ఇప్పుడు షిండే తన హామీని నెరవేర్చలేక పోతున్నారని, అందుకే మంత్రివర్గ విస్తరణ ఆలస్యమవుతోందని పవార్ అన్నారు. ఆలస్యానికి కారణమేమిటో కూడా ముఖ్యమంత్రి చెప్పాలని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు