‘పోలీస్ స్టేషన్లలో మూలుగుతున్న 5 వేల రెమ్ డెసివిర్ వయల్స్’, కోర్టు పర్మిషన్ ఎప్పుడు ?

కోవిడ్ రోగుల చికిత్సలో వాడే రెమ్ డెసివిర్ మందులు వృధాగా పోలీసు స్టేషన్లలో పడి  మూలుగుతున్నాయి. సుమారు 5 వేల వయల్స్ ఫుడ్ అండ్ డ్రగ్ సంస్థతో బాటు పోలీసు స్టేషన్లలోనూ వృధాగా ఉన్నాయని మహారాష్ట్ర అధికారులు తెలిపారు.

  • Publish Date - 2:37 pm, Sat, 24 April 21 Edited By: Phani CH
‘పోలీస్ స్టేషన్లలో మూలుగుతున్న 5 వేల రెమ్ డెసివిర్  వయల్స్’, కోర్టు పర్మిషన్ ఎప్పుడు ?
Maharashtra Awaits Court's Nod For Use

కోవిడ్ రోగుల చికిత్సలో వాడే రెమ్ డెసివిర్ మందులు వృధాగా పోలీసు స్టేషన్లలో పడి  మూలుగుతున్నాయి. సుమారు 5 వేల వయల్స్ ఫుడ్ అండ్ డ్రగ్ సంస్థతో బాటు పోలీసు స్టేషన్లలోనూ వృధాగా ఉన్నాయని మహారాష్ట్ర అధికారులు తెలిపారు. వీటిని మార్చి-ఏప్రిల్ నెలల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల సందర్భంగా స్వాధీనం చేసుకున్నారు. అయితే కోర్టు అనుమతిస్తే తప్ప వీటిని కోవిడ్  రోగులకు వాడడానికి వీలు లేదని ఎఫ్ డీ ఏ అధికారి ఒకరు తెలిపారు. వీటిని  స్వాధీనమైతే చేసుకున్నాం గానీ,  ఎలా ప్రొక్యూర్ చేశారు, తదితర సాక్ష్యాధారాలను సేకరించాల్సి ఉంటుందని, అభియోగాలను నమోదు చేసి,, స్వాధీనం చేసుకున్న ఈ వయల్స్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఈ సెకండ్ కోవిడ్ కేసుల విపత్కర పరిస్థితుల్లో ఈ కేసు గెలవడం ఎంతయినా ముఖ్యమని ఆయన చెప్పారు. కోర్టు ఎంత త్వరగా అనుమతినిస్తే అంత మంచిదన్నారు. అయితే ఇన్ఫెక్షన్ సోకిన నిర్దిష్ట సమయంలోనే రెమ్ డెసివిర్ మందును వాడాల్సి ఉంటుందని ఆరోగ్య శాఖ అధికారి పేర్కొన్నారు. సాధారణంగా ఇన్ఫెక్షన్ సోకి ఆరు రోజులు పూర్తయిన తరువాత  రోగులపై ఈ మందు పని చేయదని ఆయన చెప్పారు. చాలా ఆలస్యంగా ఇస్తే ఫలితం ఉండదని స్పష్టం చేశారు. (ఇప్పటికే రెమ్ డెసివిర్ నాణ్యతపై అనేకమంది నిపుణులు సందేశాలు వ్యక్తం చేశారు).

స్వాధీనం చేసుకున్న వయల్స్ ని సకాలంలో వాడకపోతే రోగుల పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీతో వర్చ్యువల్ గా జరిగిన సమావేశంలో మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే.. తమ రాష్ట్రంలో కోవిడ్ రోగుల సంఖ్య దృష్ట్యా.. ఈ మందు లభ్యమయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Libya boat accident: మరోసారి మధ్యధరా సముద్రంలో పడవ మునక.. లిబియా తీరంలో 130 మంది శరణార్ధుల మృతి

Medical Oxygen Shortage: దేశంలో వేధిస్తున్న ఆక్సిజన్ కొరత.. అమృత్‌సర్‌లో ఆరుగురు రోగుల మృతి