Cyber Crime: యూకే నుంచి ఫోన్ అనగానే అత్యాశకు పోయింది.. ఉన్నదంతా పొగొట్టుకుంది.. సీన్ కట్ చేస్తే..

సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకుల బలహీనత, అత్యాశను ఆసరాగా చేసుకొని రూ. కొట్లల్లో సొమ్ము చేసుకుంటున్నారు. అందినకాడికి దండుకుంటూ బాధితులను బురిడికొట్టిస్తున్నారు.

Cyber Crime: యూకే నుంచి ఫోన్ అనగానే అత్యాశకు పోయింది.. ఉన్నదంతా పొగొట్టుకుంది.. సీన్ కట్ చేస్తే..
Woman
Follow us

|

Updated on: Nov 20, 2022 | 9:09 AM

Alibag woman: సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకుల బలహీనత, అత్యాశను ఆసరాగా చేసుకొని రూ. కొట్లల్లో సొమ్ము చేసుకుంటున్నారు. అందినకాడికి దండుకుంటూ బాధితులను బురిడికొట్టిస్తున్నారు. తాజాగా.. ఓ భారీ సైబర్ క్రైమ్ జరిగింది. సోషల్ మీడియాలో పరిచయమైన ఓ క్రిమినల్.. మహిళ దగ్గర నుంచి రూ.కోటికి పైగా దండుకున్నాడు. చివరకు మోసపోయానని గ్రహించిన మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా అలీబాగ్‌లో చోటుచేసుకుంది. సైబర్‌ నేరగాడి మాయలో పడి బాధితురాలు కోటి 12 లక్షల రూపాయలు ముట్టజెప్పిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రాయ్‌గఢ్‌ అలీబాగ్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. బాధిత మహిళ కోర్టు సూపరింటెండెంట్‌గా పనిచేసి ఇటీవలనే పదవీ విరమణ చేసింది. ఈ ఏడాది జూన్‌‌లో సోషల్‌ మీడియాలో ఆమెకు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని మాంచెస్టర్ లో ఉంటున్నట్లు చెప్పాడు. వారి మధ్య స్నేహం ఫోన్ చేసుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఇటీవల బాధితురాలికి ఫోన్‌ చేసి బంగారు బహుమతులు, డబ్బు పంపిస్తున్నానంటూ నమ్మించాడు. అయితే.. వాటిని తీసుకోవాలంటే కస్టమ్స్‌ సుంకం చెల్లించాలంటూ బురిడీ కొట్టించాడు. అది నమ్మిన మహిళ .. ఆ వ్యక్తి చెప్పిన ఖాతాకు రూ.1.12 కోట్లు బదిలీ చేసింది.

ఆ తర్వాత ఆ వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం.. ఫోన్ కూడా స్వీచ్ఛాఫ్ వస్తుండటంతో మహిళ తాను మోసపోయానని గ్రహించింది. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని పట్టుకోనేందుకు ప్రయత్నిస్తున్నామని అలీబాగ్ పోలీస్ స్టేషన్ అధికారి శనివారం తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..