బడ్జెట్ ప్రసంగంలో బసవేశ్వరుని ప్రవచనాలు

2019-20 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ప్రత్యేకతను చూపారు. దేశ ఆర్ధిక మంత్రిగా ఆమె తొలి బడ్జెట్ ప్రసంగం చేస్తూ సంఘ సంస్కర్త బసవేశ్వరుని ప్రవచనాలను చదివి వినిపించారు. మధ్య యుగాలనాటి కాలంలో అనేక సాంఘిక దురాచారాలపై బసవేశ్వరుడు పోరాటం చేశాడు. ఆయన చెప్పిన కొన్ని ప్రవచనాలను కేంద్ర మంత్రి ప్రస్తావిస్తూ “కాయకవ కైలాస” అంటూ ప్రారంభించారు. మనం ఏ వృత్తిలో ఉన్నా, లేక ఏ పని చేస్తున్నా దాన్ని […]

బడ్జెట్ ప్రసంగంలో బసవేశ్వరుని ప్రవచనాలు
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 06, 2019 | 7:53 PM

2019-20 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ప్రత్యేకతను చూపారు. దేశ ఆర్ధిక మంత్రిగా ఆమె తొలి బడ్జెట్ ప్రసంగం చేస్తూ సంఘ సంస్కర్త బసవేశ్వరుని ప్రవచనాలను చదివి వినిపించారు. మధ్య యుగాలనాటి కాలంలో అనేక సాంఘిక దురాచారాలపై బసవేశ్వరుడు పోరాటం చేశాడు. ఆయన చెప్పిన కొన్ని ప్రవచనాలను కేంద్ర మంత్రి ప్రస్తావిస్తూ “కాయకవ కైలాస” అంటూ ప్రారంభించారు.

మనం ఏ వృత్తిలో ఉన్నా, లేక ఏ పని చేస్తున్నా దాన్ని ఎంతో శ్రద్దతో పూర్తి చేయాలి. దాసోహ అంటే మనం సంపాదించిన దానిలో కొంత భాగాన్ని సమాజ హితం కోసం తిరిగి ఇవ్వాలి. మనం ఎంచుకున్న వృత్తిని నిబద్దతతో చేయాలి. ఈ సూక్తిని చదివిన కేంద్రమంత్రి.. బసవేశ్వరుని ఆశయాల స్ఫూర్తితో కేంద్రం అడుగులు వేస్తోందన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ లక్ష్యంతో పనిచేస్తోందని దేశంలో దాదాపు 10 మిలియన్ల యువతకు నైపుణ్యాభివృద్దిలో ట్రైనింగ్ ఇవ్వనున్నట్టుగా తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవభావంతో జీవించేందుకు వీలుగా అట్టడుగు వర్గాల యువత లక్ష్యంగా ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సమాజంలోని అందరికి సంక్షేమ ఫలాలు అందివ్వాలన్న బసవేశ్వరుని బాటలో తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.