బ్రేకింగ్, రేపు లోక్ సభ నిరవధిక వాయిదా ?

ఎనిమిది మంది రాజ్యసభ విపక్ష సభ్యుల సస్పెన్షన్, ఆ తరువాత సభా కార్యకలాపాల బాయ్ కాట్ పై ప్రతిపక్షాల నిర్ణయంతో బాటు మంగళవారం లోక్ సభ కార్యకలాపాలను కూడా ఈ  పార్టీలు బహిష్కరించడంతోను..

  • Umakanth Rao
  • Publish Date - 6:48 pm, Tue, 22 September 20
బ్రేకింగ్, రేపు లోక్ సభ నిరవధిక వాయిదా ?

ఎనిమిది మంది రాజ్యసభ విపక్ష సభ్యుల సస్పెన్షన్, ఆ తరువాత సభా కార్యకలాపాల బాయ్ కాట్ పై ప్రతిపక్షాల నిర్ణయంతో బాటు మంగళవారం లోక్ సభ కార్యకలాపాలను కూడా ఈ  పార్టీలు బహిష్కరించడంతోను, కరోనా వైరస్ పాండమిక్ నేపథ్యంలోనూ రేపు లోక్ సభ నిరవధికంగా వాయిదా పడే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రం రాజ్యసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని కూడా విపక్ష ఎంపీలు బాయ్ కాట్ చేశారు. టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రీన్, సమాజ్ వాదీ పార్టీ సభ్యుడు రామ్ గోపాల్ యాదవ్, ఆర్జేడీ సభ్యుడు మనోజ్ ఝా, కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, జైరాం రమేష్, ఆనంద్ శర్మ ఈ సమావేశానికి గైర్ హాజరయ్యారు.