Karnataka Lockdown: కర్ణాటకలో లాక్‌డౌన్ తప్పదు.. క్లారిటీ ఇచ్చిన సీఎం యడియూరప్ప..

CM BS Yediyurappa: దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు నమోదవుతుండగా.. వేలాది మంది మరణిస్తున్నారు. ముఖ్యంగా మహరాష్ట్రలో, కర్ణాటకలో

Karnataka Lockdown: కర్ణాటకలో లాక్‌డౌన్ తప్పదు.. క్లారిటీ ఇచ్చిన సీఎం యడియూరప్ప..
కర్ణాటక బీజేపీ సీనియర్‌ నేత, పార్టీకి ఎంతో నమ్మకస్తుడైన బీఎస్‌ యెడియూరప్ప సీఎం పదవిని నాలుగుసార్లు చేపట్టారు. అయితే ఏ ఒక్కసారి కూడా పూర్తి కాలం ముఖ్యమంత్రి పదవిలో ఆయన కొనసాగలేదు. యడియూరప్ప సీఎం పదవికి నాలుగుసార్లు రాజీనామా చేయడానికి దారితీసిన కారణాలను పరిశీలిస్తే.. 2007లో.. ఎనిమిది రోజులు సీఎంగా యెడ్డీ.. 2006 జనవరిలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి జేడీ(ఎస్‌) తన మద్దతు ఉపసంహరించింది. ఆ ప్రభుత్వం కూలిపోవడంతో జేడీ(ఎస్‌), బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
Follow us

|

Updated on: May 07, 2021 | 3:12 PM

CM BS Yediyurappa: దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు నమోదవుతుండగా.. వేలాది మంది మరణిస్తున్నారు. ముఖ్యంగా మహరాష్ట్రలో, కర్ణాటకలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే.. గత కొద్ది రోజులుగా కర్ణాటకలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై.. రాష్ట్రంలో నైట్‌ కర్ఫ్యూను అమలుచేస్తోంది. అయినప్పటికీ రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దీంతో కరోనా నియంత్రణకు రాష్ట్రంలో కఠిన లాక్‌డౌన్‌ విధించాలని నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నందున కర్ణాటకలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించాల్సి ఉంటుందంటూ స్పష్టంచేశారు. రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ప్రజలు నియమాలు పాటించడం లేదని.. కావున మహమ్మారి వ్యాప్తి అధికమువుతోందన్నారు. వీటన్నింటి మధ్య కర్ణాటకలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌కు వెళ్లడం అనివార్యం కావొచ్చని.. దీనిపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం యడియూరప్ప పేర్కొన్నారు.

కాగా.. కోవిడ్ రోగులకు సహాయం కోసం తన నివాసానికి తీసుకురావొద్దని సీఎం యడియూరప్ప ప్రజలను సూచించారు. గురువారం పలువురు కొవిడ్‌ రోగులను సీఎం ఆఫీసు వద్దకు తీసుకువచ్చి ఆసుపత్రిలో బెడ్‌ సౌకర్యం కల్పించాలని పలు కుటుంబాలు కోరాయి. ఈ క్రమంలో ఆయన స్పందిస్తూ.. అధికారులు సహాయం అందిస్తారని, ప్రజల సమస్యలను అర్థం చేసుకున్నానని తెలిపారు. తాము మీతోనే ఉన్నామని.. దయ చేసి రోగులను విధాన సౌధకు, నివాసానికి తీసుకురావొద్దని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉంటే.. మహారాష్ట్ర తర్వాత కర్ణాటకలోనే రోజువారీ కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కర్ణాటకలో 49,058 కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం 50వేల మార్క్‌ను దాటాయి. బెంగళూరులోనే 20 వేలకు పైగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో కేసుల పెరుగుదల నేపథ్యంలో ఆక్సిజన్‌ డిమాండ్‌ సైతం పెరిగింది. వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.

Also Read:

Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు పేటీఎం బంపర్ ఆఫర్..9 రూపాయలకే సిలెండర్.. దీనికోసం ఏం చేయాలంటే..

Mi Fast Charger: భారత్‌లో విడుదల కానున్న ఎంఐ కొత్త ఫాస్ట్ ఛార్జర్.. దీని ప్రత్యేకతలు ఇవే..!