Big Breaking: మే 31 వరకు లాక్‌డౌన్ 4.0.. అవి బంద్.. కొత్త మార్గదర్శకాలివే..!

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ రేపటి నుంచి నాలుగో దశలోకి ఎంటర్ అవుతోంది. ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్ పొడిగించాలని చాలా రాష్ట్రాల సీఎంలు మోదీకి రిక్వెస్ట్ చేశాయి

Big Breaking: మే 31 వరకు లాక్‌డౌన్ 4.0.. అవి బంద్.. కొత్త మార్గదర్శకాలివే..!
Follow us

| Edited By:

Updated on: May 17, 2020 | 7:23 PM

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ రేపటి నుంచి నాలుగో దశలోకి ఎంటర్ అవుతోంది. ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్ పొడిగించాలని చాలా రాష్ట్రాల సీఎంలు మోదీకి రిక్వెస్ట్ చేశాయి. అంతేకాదు కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశాయి. మరోవైపు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ కూడా లాక్‌డౌన్ ఈ నెల 31 వరకు పొడిగించడమే మేలని కేంద్రానికి సూచించింది. ఈ క్రమంలో హాట్‌స్పాట్ ఏరియాల్లో ఆంక్షలు మరింత కఠినతరం చేస్తూ..  కొత్త మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. వాటి ప్రకారం మే 31 వరకు దేశ వ్యాప్తంగా సినిమా హాళ్లు, విద్యాసంస్థలు, విమాన సర్వీసులు, మెట్రో సర్వీసులు, హోటళ్లు, రెస్టారెంట్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌ ఫూల్స్, థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్స్‌ బంద్ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వీటితో పాటు అన్ని సామాజిక, రాజకీయ, మతపర కార్యక్రమాలను మే 31వరకు నిర్వహించకూడదని వెల్లడించింది.

ఇప్పటిలాగే ఉదయం గం.7 నుంచి సాయంత్రం గం.7 వరకు కర్ఫ్యూ కొనసాగనున్నట్లు తెలిపింది. ఇక సంస్థలు తమ దగ్గర పనిచేసే ఉద్యోగులు ఆరోగ్య సేతు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించింది. కుదిరితే జిల్లా అధికారులు కూడా ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకునే విధంగా ప్రోత్సహించాలని తెలిపింది. ఇక ప్రజా రవాణా విషయంలో రాష్ట్రాల పరస్పర అంగీకారంతో అనుమతి ఇచ్చింది. అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు షరతులతో కూడిన అనుమతులు జారీ చేసింది.