క్వారీ గుంటలో నాలుగు మృతదేహాలు.. ఎన్నో అనుమానాలకు తావిస్తోన్న ఇన్సిడెంట్.. ఏం జరిగింది..

పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌లోని ఓ పాడుబడిన రాతి క్వారీ నీటిలో నాలుగు మృతదేహాలు కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృతుల్లో ఒక పురుషుడు, ఒక మహిళ, ఇద్దరు...

క్వారీ గుంటలో నాలుగు మృతదేహాలు.. ఎన్నో అనుమానాలకు తావిస్తోన్న ఇన్సిడెంట్.. ఏం జరిగింది..
Crime News
Follow us

|

Updated on: Jan 16, 2023 | 7:18 AM

పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌లోని ఓ పాడుబడిన రాతి క్వారీ నీటిలో నాలుగు మృతదేహాలు కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మృతుల్లో ఒక పురుషుడు, ఒక మహిళ, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ జిల్లా నార్త్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్లాకు చెందిన చాసి పాడా, ఆదివాసీ పడా మధ్య ఉన్న ఒక పాడుబడిన రాతి క్వారీలో మృతదేహాలు కనిపించాయి . ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మొత్తం కేసును దర్యాప్తు చేస్తున్నారు. మృతులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. వారు గనిలోకి ఎలా ప్రవేశించారనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, రెస్క్యూ టీమ్‌కు సమాచారమిచ్చారు. వారు లోతైన క్వారీ నుంచి మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

రాతి గొయ్యి పైన చిన్న రోడ్డు ఉంది. ఆ దారి గుండా వెళుతుండగా పై నుంచి పడి ఉంటారా లేక స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు క్వారీలో పడిపోయి ఉంటారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. లేక ఆత్మహత్య చేసుకున్నారా అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. చుట్టూ అడవి, మధ్యతో గుంతలో మృతదేహాలు కనిపించడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. మృతదేహాలు 300 అడుగుల లోతులో ఉన్నాయని, బయటకు తీయడంలో అవాంతరాలు ఎదురవుతున్నాయని రెస్క్యూ టీమ్ పేర్కొంది.

ఇప్పటివరకు మృతదేహాలు లభ్యం కాలేదు. సోమవారం ఉదయం డెడ్ బాడీస్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. అసన్‌సోల్‌ డీసీపీ డాక్టర్‌ కుల్‌దీప్‌ నేతృత్వంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మొత్తం కేసును విచారిస్తున్నారు. ఘటనకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!