Leopard : తీర్థన్ వ్యాలీలో వింత ఘటన.. టూరిస్టులను ఆశ్చర్యానికిి గురిచేసిన చిరుత వ్యవహారం..

టూరిస్టుల చేతులు పట్టుకుని వేలాడుతూ వింతగా ప్రవర్తించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని తీర్థన్ వ్యాలీలో చోటుచేసుకుంది.

Leopard : తీర్థన్ వ్యాలీలో వింత ఘటన.. టూరిస్టులను ఆశ్చర్యానికిి గురిచేసిన చిరుత వ్యవహారం..
Follow us

|

Updated on: Jan 15, 2021 | 2:18 PM

Leopard : అడవిలోనైనా.. జనారణ్యంలోనైనా.. ఎక్కడైనా తనదే పైచేయి.. అదే చిరుత.. అది టార్గెట్ చేసి వేటాడిందంటే.. పరుగులు పెట్టినా ప్రాణాలు దక్కడం కష్టమే. కానీ హిమాచల్‌ప్రదేశ్‌లోని తీర్థన్ వ్యాలీ టూరిస్టులకు ఎదురుపడిన ఈ చిరుత కొద్దిగా ఆశ్చర్యానికి గురిచేసింది.

అడవిలో ఉండే చిరుత మన ముందు ప్రత్యక్షమైతే ఒక్కసారిగా గుండె ఆగిపోతాయి. అలాంటిది చిరుత కళ్లముందు తిరుగుతుంటే అంతా వణికిపోవాల్సిందే.. కానీ అక్కడ చిరుత కనిపించినా జనం భయపడలేదు. ఆ చిరుత కూడా అలా చేయలేదు. కనిపించిన టూరిస్టుల వద్దకు వచ్చి వింతగా ప్రవర్తించింది.

చిన్నపిల్లలు తమను ఎత్తుకోమని మారం చేసినట్లుగా మనుషుల చేతులు పట్టుకుని వేలాడుతూ వింతగా ప్రవర్తించి ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లోని తీర్థన్ వ్యాలీలో కనిపించింది.

హిమాచల్‌ప్రదేశ్‌ అంటేనే టూరిస్ట్ హబ్. ఈ నేపథ్యంలో తీర్థన్ వ్యాలీకి వచ్చినవారికి ప్రత్యేక ఆకర్షనగా మారుతోంది ఈ చిరుత. టూరిస్టులు వాహనాల్లో వెళ్తుండగా ఓ చిరుత రోడ్డుపై కనిపించింది. దీంతో వారంతా తమ వాహనాలను ఆపేసి ఆసక్తిగా గమనించారు. వారు రోడ్డుపై నిలబడి ఉండగా ఆ చిరుత వారి పక్కనుంచే వెళ్లింది కానీ దాడి చేయలేదు. అంతే అంతా షాక్… ఓ వ్యక్తిపైకి ఎగబాకి ఎంతో పెంపుడు పిల్లిలా ప్రవర్తించింది.

పర్యాటకుల మధ్య తిరిగినా ఎవరికీ హాని చేయకపోవడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.