న్యాయమూర్తులపై పెరుగుతున్న విమర్శలు, సోషల్ మీడియాలో అనుచిత ట్రోలింగులు, కేంద్ర మంత్రి ఆందోళన

దేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు, జిల్లా కోర్టుల్లోని జడ్జీలపై కొంతమంది అదేపనిగా విమర్శలు చేస్తున్న తీరు పెరుగుతుండడంపట్ల కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్..

  • Umakanth Rao
  • Publish Date - 7:16 pm, Sat, 27 February 21
న్యాయమూర్తులపై పెరుగుతున్న విమర్శలు, సోషల్ మీడియాలో అనుచిత ట్రోలింగులు, కేంద్ర మంత్రి ఆందోళన

దేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు, జిల్లా కోర్టుల్లోని జడ్జీలపై కొంతమంది అదేపనిగా విమర్శలు చేస్తున్న తీరు పెరుగుతుండడంపట్ల కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒక సమస్యపై జడ్జీ ఇచ్చిన తీర్పు తమకు అనుకూలంగా కాక..వ్యతిరేకంగా వస్తే వారు న్యాయమూర్తులను అవమానపరిచే విధంగా విమర్శలు చేస్తున్నారని, సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగులు పెడుతున్నారని ఆయన అన్నారు. శనివారం పాట్నా హైకోర్టు సెంటినరీ బిల్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన..ఇదెంతో గర్హనీయమన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే, కొందరు ఇతర జడ్జీలు, పాట్నా హైకోర్టుకు చెందిన నయమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియాలో ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చునని, వారికి భావ ప్రకటన స్వేచ్చ ఉందని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. కానీ ఈ మధ్య కాలంలో కొందరు మొదట కోర్టుల్లో ‘పిల్’ దాఖలు చేయడం, ఆ తరువాత దానిపై న్యాయమూర్తులు తమకు అనుకూలంగా కాకుండా తీర్పులు ఇస్తే వారిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. పైగా సామాజికమాధ్యమాల్లో ట్రోల్ చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.

ఆయా కేసుల విచారణలో జడ్జీలు తమకు తెలిసిన చట్టం ప్రకారం తీర్పులు ఇస్తారని, ఇందుకు వారికీ స్వేచ్చ ఉందని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.  ఒక కేసులో ఒక తీర్పు వస్తే దాన్ని సవాల్ చేస్తూ మరో కోర్టుకు ఎక్కవచ్చునని, కానీ అక్కడ కూడా వ్యతిరేక ఉత్తర్వులు వచ్చినప్పుడు జడ్జీల పట్ల అసభ్యంగా పోస్టింగులు పెడుతున్న తీరు తననెంతో బాధిస్తోందని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో అనేకమంది యాక్టివిస్టులు కొన్ని తీర్పులపట్ల, ఉత్తర్వుల పట్ల న్యాయవ్యవస్థను, న్యాయమూర్తులను కించపరిచే విధంగా వ్యాఖ్యానిస్తున్నారు. లాయర్ ప్రశాంత్ భూషణ్, కునాల్ కమ్రా వంటివారు తమ ట్వీట్లలో జుడిషియరీని తప్పు పడుతూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసిన విషయం గమనార్హం. ప్రశాంత్ భూషణ్ అయితే సుప్రీంకోర్టుకు సైతం క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు. తాను  జైలుకైనా వెళ్లడానికి సిధ్ధమని, కానీ అపాలజీ చెప్పబోనని ఆ యన ఆమధ్య పేర్కొన్నారు. తన ఆత్మసాక్షి ప్రకారం నడచుకుంటానన్నారు.

Also Read:

PM-KISAN Scheme: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం రైతు కేవలం ఆరువేలే కాదు ఎన్ని ప్రయోజనాలు పొందవచ్చో తెలుసా..!

Covid Vaccine Price: కోవిడ్ వ్యాక్సిన్ ఇక మరింత విరివిగా.. ధర నిర్ణయించిన సర్కార్.. ప్రైవేటులో వంద అదనం