కువైట్ బిల్లు.. భారతీయుల గుండెలు బేజారు

తమ దేశంలో ఉపాధి, ఉద్యోగాలు చేసుకుంటున్న విదేశీ వర్కర్ల సంఖ్యను తగ్గించేందుకు కువైట్ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ఓ ముసాయిదా బిల్లును తెచ్చింది. జాతీయ అసెంబ్లీ లోని లీగల్..

కువైట్ బిల్లు.. భారతీయుల గుండెలు బేజారు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 06, 2020 | 4:35 PM

తమ దేశంలో ఉపాధి, ఉద్యోగాలు చేసుకుంటున్న విదేశీ వర్కర్ల సంఖ్యను తగ్గించేందుకు కువైట్ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ఓ ముసాయిదా బిల్లును తెచ్చింది. జాతీయ అసెంబ్లీ లోని లీగల్ లెజిస్లేటివ్ కమిటీ.. ఈ బిల్లును రాజ్యాంగబధ్ధమైనదిగా పరిగణించగా.. మరో కమిటీ దీనికి ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఈ ముసాయిదా బిల్లు చట్టమైతే.. ముఖ్యంగా  సుమారు ఎనిమిది లక్షల మంది భారతీయులు వెనక్కి .. ఇండియాకు తిరిగి రావాల్సిందే. ఈ దేశంలోని 4.8 మిలియన్ జనాభాలో భారతీయులే సుమారు 1.4 మిలియన్ల మంది ఉన్నారు. బిల్లు చట్టమైన పక్షంలో.. ఇక్కడి భారతీయుల సంఖ్య దాదాపు ఆరున్నర లక్షల నుంచి ఏడు లక్షలకు తగ్గిపోతుంది.

ఈ గల్ఫ్ దేశంలో  వివిధ రంగాల్లో భారతీయులు ఏళ్ళ తరబడి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా  నిర్మాణ రంగంలో పని చేస్తున్నవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వీరితో బాటు ఈజిప్షియన్లు కూడా ఉన్నప్పటికీ.. వీరి కారణంగా తాము మైనారిటీలో పడిపోయామని ఇక్కడి ప్రజలు భావిస్తున్నట్టు కనిపిస్తోంది. విదేశీ వర్కర్లపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని కువైట్ ప్రభుత్వం యోచిస్తున్న కారణంగానే ఈ బిల్లును తెచ్చినట్టు కనిపిస్తోంది. కోవిడ్-19 తో బాటు ఆయిల్ ధరల్లో హెచ్చు తగ్గుదల కూడా ఇందుకు కారణమని భావిస్తున్నారు.  ఈజిప్షియన్ల సంఖ్యను కూడా తగ్గించాలన్నది కువైట్ యోచన. ఈ దేశ జనాభాలో వారు సుమారు పది శాతం ఉన్నారు. కాగా ఈ పరిణామాలనన్నిటినీ కువైట్ లోని భారత ఎంబసీ జాగ్రత్తగా గమనిస్తోంది. అయితే ఎలాంటి కామెంట్ చేయలేదు. 2009 లో భారత ఎంబసీ.. ఇండియన్ వర్కర్స్ వెల్ ఫేర్ సెంటర్ అనే  కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. భారత దేశానికి చెందిన కార్మిక సిబ్బంది ఇక్కడ ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ఉద్దేశించి దీన్ని ఏర్పాటు చేశారు.