కరోనా సూపర్‌ స్ప్రెడర్‌గా మారిన కుంభమేళా, ఇవాళ్టితో ముగించాలా, కొనసాగించాలా అన్నదానిపై సాధువుల మధ్య పంచాయితీ

అనుకున్నందంతా అయ్యింది. కుంభమేళా కారణంగా కరోనా మరింత వ్యాప్తి చెందుతుందేమోనని భయపడ్డాం.. ఇప్పుడది నిజమయ్యింది. దేవభూమి ఉత్తరాఖండ్‌ కరోనా కోరల్లో చిక్కుకుంటోంది.

కరోనా సూపర్‌ స్ప్రెడర్‌గా మారిన కుంభమేళా, ఇవాళ్టితో ముగించాలా, కొనసాగించాలా అన్నదానిపై సాధువుల మధ్య పంచాయితీ
Kumbh Mela
Follow us

| Edited By: Phani CH

Updated on: Apr 17, 2021 | 10:51 AM

అనుకున్నందంతా అయ్యింది. కుంభమేళా కారణంగా కరోనా మరింత వ్యాప్తి చెందుతుందేమోనని భయపడ్డాం.. ఇప్పుడది నిజమయ్యింది. దేవభూమి ఉత్తరాఖండ్‌ కరోనా కోరల్లో చిక్కుకుంటోంది. హరిద్వార్‌లో జరుగుతున్న కుంభమేళాలో షాహీ స్నానాల సందర్భంగా లక్షల సంఖ్యలో భక్తులు గంగానదిలో పుణ్యస్నానాలు చేశారు. అప్పటి నుంచి కరోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరగసాగాయి. కుంభమేళా సూపర్‌స్ప్రెడర్‌గా మారింది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఫిబ్రవరి 14 నుంచి నెల చివరి వరకు 172 మందికి మాత్రమే కరోనా సోకింది. అయితే ఏప్రిల్ ఒకటి నుంచి 15 వరకు ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. పక్షం రోజుల్లోనే రాష్ట్రంలో 15 వేల మందికిపైగా కరోనా సోకింది. అంటే పాజిటివ్‌ కేసుల వృద్ధి రేటు 8814 శాతమన్నమాట! మహా కుంభమేళాలో పాల్గొన్న సాధువులను కూడా కరోనా వదల్లేదు. చాలా మందికి కరోనా అంటుకుంది. ఇద్దరు ముగ్గురు సాధువులు చనిపోయారు కూడా! ఇదిలా ఉంటే, కుంభమేళాలో సాధువులు నిట్టనిలువునా చీలిపోయారు. ఇవాళ్టితో కుంభమేళా ముగిసినట్టు ప్రకటించిన నిరంజని, ఆనంద్‌ అఖాడాలపై బైరాగి సాధువులు, అవిముక్తేశ్వరానందలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంభమేళాకు లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో ఉత్తరాఖండ్‌లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతి ఒకటిన్నర నిమిషానికి ఒకరు కరోనా బారిన పడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కుంభమేళాను షెడ్యూల్‌ కంటే ముందు ముగిస్తే మంచిదని కొందరు సాధువులు భావించారు. కుంభమేళాను ఇవాళ్టితో ముగించనున్నట్టు నిరంజని అఖాడా, ఆనంద్‌ అఖాడాలు ప్రకటించాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తమ దృష్టిలో ఇవాళ్టితో కుంభమేళా ముగిసిందని నిరంజని అఖాడా కార్యదర్శి మహంత్‌ రవీంద్రపూరి తెలిపారు. కుంభమేళా ముగిసిందని ప్రకటించిన రవీంద్రపూరికి కూడా కరోనా సోకింది. దీంతో అఖాడాల్లోని ఇతర సాధువుల్లో ఆందోళనతో నెలకొంది. దాంతో పాటు కాసింత గందరగోళం కూడా ఏర్పడింది. రవీంద్రపూరితో పాటు మరో 16 మంది సాధువులకు కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. అలాగే అఖిల భారతీయ అఖాడా పరిషత్‌ అధ్యక్షుడు నరేంద్ర గిరికి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది.

కరోనా విజృంభిస్తుందుకే కుంభమేళాను కుదించడం జరిగిందన్నది కొందరు అఖాడాల అభిప్రాయం. అసలు ఆ నిర్ణయం తీసుకోవడానికి వారెవరూ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బైరాగి సాధువులు. ఇంకోవైపు జగద్గురు శంకరాచార్యుల శిష్యుడైన స్వామి అవిముక్తేశ్వరానంద మాత్రం అనుకున్నట్టుగానే అంటే నిర్ణీతకాలం వరకు కుంభమేళా కొనసాగుతుందని స్పష్టం చేశారు. కుంభమేళా ఏ ఒక్క సంస్థకో, అఖాడాలకో చెందినది కాదని ఆయన అంటున్నారు. నిరంజని, ఆనంద్‌ అఖాడాలకు చెందిన సాధువులు తాము చేసిన ప్రకటనపై భక్తులకు క్షమాపణ చెప్పాలని నిర్మోహి, నిర్వాణి, దిగంబర్‌ అఖాడాలు డిమాండ్‌ చేశాయి. కుంభమేళాను ముగించే హక్కు ముఖ్యమంత్రికి, మేళా అడ్మినిస్ట్రేషన్‌కు మాత్రమే ఉందని వారంటున్నారు. కుంభమేళా ముగిసిందని ప్రకటించిన సాధువు క్షమాపణ చెప్పకపోతే, ఆయన అఖాడా కౌన్సిల్‌లోంచి వైదొలగాలని డిమాండ్‌ చేశారు. తప్పుకోకపోతే తామే తప్పిస్తామని కూడా అన్నారు. కుంభమేళా నేటితో ముగియదని, ఈ నెల 27 వరకు కనొసాగుతుందని, ఆ రోజున బైరాగి సాధువులంతా షాహీ స్నానాలు చేస్తారని నిర్మోహి, నిర్వాణి, దిగంబర్‌ అఖడాలు అంటున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి:

US: ఫెడెక్స్ కాల్పుల ఘటనలో.. నలుగురు సిక్కులు సహా 8 మంది మృతి.. స్పందించిన భారత్

Actor Vivek: నటుడు వివేక్ హఠాన్మరణంపై అనుమానాలు? తమిళనాడు ఎంపీ సంచలన వ్యాఖ్యలు