బాలీవుడ్‌ని వెంటాడిన‌ విషాదం…ప్ర‌ముఖ నిర్మాత మృతి

బాలీవుడ్‌ని వెంటాడిన‌ విషాదం...ప్ర‌ముఖ నిర్మాత మృతి

బాలీవుడ్‌ని విషాదం వెంటాడింది. ప్ర‌ముఖుల మ‌ర‌ణాల‌తో క‌న్నీటి సంద్రంలో మునిగిపోయిన బాలీవుడ్‌కి మ‌రో షాక్ త‌గిలింది. ప్ర‌ముఖ నిర్మాత‌, టెలివిజ‌న్ అండ్ సినిమా ప్రొడ్యూస‌ర్ ...

Jyothi Gadda

|

May 01, 2020 | 1:33 PM

బాలీవుడ్‌ని వ‌రుస విషాదం వెంటాడింది. ప్ర‌ముఖుల మ‌ర‌ణాల‌తో క‌న్నీటి సంద్రంలో మునిగిపోయిన బాలీవుడ్‌కి మ‌రో షాక్ త‌గిలింది. ప్ర‌ముఖ నిర్మాత‌, టెలివిజ‌న్ అండ్ సినిమా ప్రొడ్యూస‌ర్ గిల్డ్ ఆఫ్ ఇండియా సీఈవో కుల్మీత్ మ‌క్క‌ర్ శుక్ర‌వారం ఉద‌యం గుండెపోటుతో మ‌ర‌ణించారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని ధ‌ర్మ‌శాల‌లో గ‌ల ప్ర‌ముఖ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న కుల్మీత్ శుక్ర‌వారం తుదిశ్వాస విడిచారు. ల‌క్‌డౌన్ విధించ‌క‌ముందే ఇంట్లోనే గుండెపోటుకు గురైన కుల్మీత్ అప్ప‌టి నుంచి ధ‌ర్మ‌శాల‌లోని ఆస్ప‌త్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. బాలీవుడ్ న‌టి విద్యాబాల‌న్‌, ప్ర‌ముఖ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్ జోహ‌ర్‌, ద‌ర్శ‌కులు హ‌న్స‌ల్ మెహ‌తా, సుభాష్ గాయ్ త‌దిత‌రులు ట్విట్ట‌ర్‌లో నివాళుల‌ర్పించారు.

కుల్మీత్ మృతిపై ప్ర‌ముఖ న‌టి విద్యాబాల‌న్ స్పందిస్తూ.. ఇది నిజంగా షాకింగ్..ఇండ‌స్ట్రీకి మీరు అందించిన సేవ‌లు ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటాం.. మా క‌న్నీటితో ఇవే మీకు మా ఘ‌న నివాళులు. నా త‌ర‌పున మీ కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాన‌ని ట్విట్  చేశారు. అస‌లు బాలీవుడ్‌క‌కు ఏమైంది. వ‌రుస విషాదాలు మ‌మ్మ‌ల్ని వెంటాడుతున్నాయి. కుల్మీత్ మ‌క్క‌ర్‌! మీ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నా అంటూ ద‌ర్శ‌కుడు హ‌న్స‌ల్ మెహ‌తా తెలిపారు.

ప్ర‌ముఖ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ కుల్మీత్ మృతిపై స్పందిస్తూ.. ప్రొడ్యూస‌ర్ గిల్డ్ ఆఫ్ సీఈవోగా మీరు నిస్వార్థ సేవ‌లందించారు. ప‌ని ప‌ట్ల మీకున్న విశ్వ‌స‌నీయ‌త‌ను ఎల్ల‌ప్పుడు గుర్తుంచుకుంటాం. అలాంటి మీరు మ‌మ్మ‌ల్ని వ‌దిలిపెట్టి వెళ్ల‌డం చాలా బాధాక‌రం. మీ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆ భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu