కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ.. పార్టీకి సీనియర్ నేత రాజీనామా.. మునుగోడుతో పాటే బైపోల్?

తెలంగాణలో సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 24 గంటలు గడవకముందే.. ఆ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ.. పార్టీకి సీనియర్ నేత రాజీనామా.. మునుగోడుతో పాటే బైపోల్?
Congress Party
Janardhan Veluru

|

Aug 03, 2022 | 5:54 PM

కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. తెలంగాణలో సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 24 గంటలు గడవకముందే.. ఆ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హర్యానాలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కులదీప్ బిష్ణోయ్ (Kuldeep Bishnoi) హస్తం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. హర్యానా అసెంబ్లీ స్పీకర్ జియాన్ చంద్ గుప్తాకు తన రాజీనామా లేఖను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కాలంనాటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లేదంటూ విమర్శించారు. పార్టీ సిద్ధాంతాల నుంచి వైదొలిగిందంటూ మండిపడ్డారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా ఎన్నికైన కులదీప్ బిష్ణోయ్ ప్రస్తుతం హర్యానాలోని హిస్సార్ జిల్లా అడంపూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బిష్ణోయ్ రాజీనామాతో అడంపూర్ శాసనసభ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది.

కులదీప్ బిష్ణోయ్ జూన్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడంతో ఆయన్ను కాంగ్రెస్ పార్టీ అన్ని పదవుల నుంచి సస్పెండ్ చేసింది. హర్యానా పీసీసీ అధ్యక్షపదవి దక్కకపోవడంతో గత కొన్ని నెలలుగా బిష్ణోయ్ కాంగ్రెస్ పై గుర్రుగా ఉన్నారు. బిష్ణోయ్ ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షులు జెపి.నడ్డా తో పాటు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, హర్యానా ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్‌లను కలిశారు. గురువారం బిష్ణోయ్ బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. హర్యానా శాసనసభ గడువు 2024 అక్టోబర్ వరకు ఉండటంతో ఇక్కడ ఉప ఎన్నిక రావడం తథ్యం కానుంది.

ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే… హిస్సార్ లోని అడంపూర్ తో పాటు తెలంగాణలోని మునుగోడు శాసనసభకు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలు చదవండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu