Presidential Elections: రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రమే ఉపయోగించే పెన్ను.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

Presidential Elections: ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో పార్లమెంటు నుండి రాష్ట్ర శాసనసభ సభ్యుల వరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ రహస్య..

Presidential Elections: రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రమే ఉపయోగించే పెన్ను.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Elections Pen
Follow us

|

Updated on: Jul 27, 2022 | 7:24 AM

Presidential Elections: ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో పార్లమెంటు నుండి రాష్ట్ర శాసనసభ సభ్యుల వరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ రహస్య ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ పేపర్‌పై తమకు నచ్చిన అభ్యర్థిని ఎంచుకుని.. ఓటు వేశారు. అయితే, ఓటింగ్ ఛాంబర్‌లోకి ప్రవేశించాక ఎన్నికల అధికారులు.. ఓటర్లకు ప్రత్యేకమైన పెన్ను ఒకటి ఇస్తారు. దాంతోనే వారు తాము ఎంచుకునే అభ్యర్థిపై టిక్ చేయాల్సి ఉంటుంది. ఈ పెన్నులను ఎన్నికల సంఘం ప్రత్యేక ఇంకుతో తయారు చేస్తుంది. అందులోని సిరా అంత త్వరగా పోదు. ఈ ప్రత్యేకమైన పెన్ తెలుపు రంగులో ఉంటుంది. దీనిని ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు. ఆ పెన్నుపై ఎలక్షన్ మార్కర్ పెన్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని కూడా రాసి ఉంటుంది. ఈ పెన్నులు, ఇంక్‌లను కర్ణాటకలోని ఓ కంపెనీ తయారు చేసి ఎన్నికల కమిషన్‌కు పంపుతుంది. వీటిని ప్రత్యేకంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఉపయోగిస్తారు.

ఓటు హక్కును వినియోగించుకున్న వారి వేలిపై ప్రత్యేకమైన ఇంక్ గుర్తు వేస్తారు ఎన్నికల అధికారులు. ఇది మీరు ఓటు వేసినట్లు సూచిస్తుంది. ఈ ఇంక్ ప్రత్యేకత ఏమిటంటే త్వరగా చెరిగిపోదు. ఇది పోవడానికి ఒకటి నుండి రెండు వారాల సమయం పడుతుంది. రాష్ట్రపతి ఎన్నికలలో ఉపయోగించే మార్కర్ పెన్నులలో కూడా ఇదే ఇంక్ ఉపయోగించబడుతుంది.

కర్ణాటకలోని ఓ కంపెనీ ఈ మార్కర్లు, ఇంక్‌లను తయారు చేస్తోంది.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉపయోగించే ఈ తెల్లటి ప్లాస్టిక్ పెన్‌లో పర్పుల్ ఇంక్ ఉంటుంది. ఈ ప్రత్యేకమైన మార్కర్ పెన్నును కర్ణాటకకు చెందిన మైసూర్ పెయింట్స్, వార్నిష్ లిమిటెడ్ తయారు చేసింది. అదే కంపెనీ మార్కర్ పెన్నులు, దాని సిరాను తయారు చేస్తుంది. భారత ఎన్నికల కమిషన్‌కు సరఫరా చేస్తుంది. అయితే, ఎన్నికల సంఘం ప్రత్యేక ఆదేశాల మేరకు పరిమిత సంఖ్యలో మాత్రమే తయారు చేయడం జరుగుతుంది. మైసూర్ పెయింట్ & వార్నిష్ లిమిటెడ్ కంపెనీలో ఎన్నికలకు ఉపయోగించే పెన్నులే కాకుండా ఇతర మార్కర్ పెన్నులు, వాటి ఇంక్‌లను కూడా తయారు చేస్తారు. ప్రతి ఎన్నికల్లోనూ ఈ కంపెనీ సిరా ఉపయోగించడం జరుగుతుంది.

అసెంబ్లీ ఎన్నికలు అయినా, లోక్‌సభ అయినా, దేశంలోని ఏదైనా ప్రత్యేక ఎన్నికలైనా.. వీటన్నింటిలోనూ ఈ సిరా ఉపయోగించడం జరుగుతుంది. 1962లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల నుండి ఈ ఇంక్ దేశంలో వాడుకలో ఉంది. గత 54 ఏళ్లుగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఇంక్‌ను ఉపయోగిస్తోంది.

2017 నుంచి పెన్ను వినియోగం.. ఈ ప్రత్యేక పెన్ను 2017లో జరిగిన అధ్యక్ష ఎన్నికల నుండి ఉపయోగించడం జరుగుతోంది. ఒక్క పెన్నుతో కనీసం 1000 సార్లు ఓటు వేయొచ్చు. బ్యాలెట్ పేపర్‌పై ఈ పెన్నుతో ఎలాంటి పదాలు రాయలేరు. ఏదైనా ఇతర మార్కర్ పెన్‌తో ఓటు వేస్తే అది రద్దు పరిగణనలోకి తీసుకోరు. భారతదేశంలో మొదటి ఎన్నికలు 1951-52లో జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటర్ల వేళ్లకు సిరా వేయాలనే నిబంధన లేదు. 1962 ఎన్నికల నుండి ఇది అమల్లోకి వచ్చింది.

కంపెనీ స్పెషాలిటీ.. కర్ణాటకలోని మైసూర్ పట్టణం తెలియని వారు ఉండరు. మైసూర్ ప్రాంతాన్ని వడియార్ రాజవంశం పరిపాలించింది. స్వాతంత్ర్యానికి ముందు దీని పాలకుడు మహారాజా కృష్ణరాజ్ వడియార్. వడియార్ రాజవంశం ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజవంశం. ఈ రాజ వంశానికి స్వంత బంగారు గని ఉంది. 1937లో కృష్ణరాజ్ వడియార్ మైసూర్ లేక్స్ అండ్ పెయింట్స్ అనే ఫ్యాక్టరీని స్థాపించారు. ఈ కర్మాగారంలో పెయింట్స్, వార్నిష్లను తయారు చేయడం జరుగుతుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, ఈ కర్మాగారం హక్కులు కర్ణాటక ప్రభుత్వ పొందింది. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీలో కర్ణాటక ప్రభుత్వానికి 91 శాతం వాటా ఉంది. 1989లో, ఫ్యాక్టరీ పేరు మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్‌గా మార్చడం జరిగింది.

ఇంక్ ట్రెండ్ ఎలా మొదలైంది.. భారతదేశంలో మొదటి ఎన్నికలు 1951-52లో జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటర్ల వేళ్లకు సిరా వేయాలనే నిబంధన లేదు. ఈ సమయంలో పలువురు దొంగ ఓట్లు వేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో దొంగ ఓట్లను నివారించడాని ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. అనేక ఆలోచనలు చేసి.. చెరిగిపోని సిరాను ఉపయోగించడమే ఇందుకు ఉత్తమ మార్గంగా తేల్చారు.

తొలిసారి ఆ ఎన్నికల్లోనే.. చెరిగిపోని ఇంక్‌ను తయారు చేయడంపై ఎన్నికల సంఘం నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ ఆఫ్ ఇండియా (ఎన్‌పిఎల్)ని సంప్రదించింది. NPL నీరు, రసాయనాల ద్వారా చెరిపివేయలేని సిరాను కనిపెట్టింది. NPL మైసూర్ పెయింట్ & వార్నిష్ కంపెనీని ఈ ఇంక్‌ను తయారు చేయాలని ఆదేశించింది. 1962లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా ఈ సిరాను వినియోగించగా, అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఈ ఇంకునే వినియోగిస్తున్నారు.

సిరా తయారీలో రహస్యం ఇదే.. NPL, మైసూర్ పెయింట్ & వార్నిష్ లిమిటెడ్ ఈ ఇంక్‌ను తయారు చేసే విధానాన్ని ఎప్పుడూ వెల్లడించలేదు. ఈ సీక్రెట్ ఫార్ములా బయటపెడితే జనాలు చెరిపేసే మార్గాన్ని కనుగొంటారని, దాని ప్రయోజనం పోతుందనే కారణంగా చెప్పలేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ సిరాకు సిల్వర్ నైట్రేట్ కలపడం జరిగింది. ఈ ఇంక్ ఫోటోసెన్సిటివ్‌గా చేస్తుంది. దీని వల్ల కాస్త గాలి, వెలుతురు తగిలిన వెంటనే అది ఎండిపోతుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..