Kerala High Court: రాత్రి వేళ అమ్మాయిలకూ స్వేచ్చ ఇవ్వాలి.. అది ప్రభుత్వ బాధ్యత.. కేరళ హైకోర్టు ఇంట్రెస్టింగ్ జస్టిస్..

కొన్ని కేసుల్లో కోర్టులు ఇచ్చే తీర్పులు సంచలనంగా మారతాయి. ముఖ్యంగా నేరాలు, హింస వంటి ఘటనల్లో న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు చర్చనీయాంశంగా మారతాయి. లైంగిక సంబంధాలు, వివాహేతర కలహాలు, మహిళలపై...

Kerala High Court: రాత్రి వేళ అమ్మాయిలకూ స్వేచ్చ ఇవ్వాలి.. అది ప్రభుత్వ బాధ్యత.. కేరళ హైకోర్టు ఇంట్రెస్టింగ్ జస్టిస్..
Court
Follow us

|

Updated on: Dec 08, 2022 | 8:59 PM

కొన్ని కేసుల్లో కోర్టులు ఇచ్చే తీర్పులు సంచలనంగా మారతాయి. ముఖ్యంగా నేరాలు, హింస వంటి ఘటనల్లో న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు చర్చనీయాంశంగా మారతాయి. లైంగిక సంబంధాలు, వివాహేతర కలహాలు, మహిళలపై దాడులు.. వంటి ఘటనల్లో తీర్పులు అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది కేరళ హై కోర్టు.. ఇప్పుడు ఎందుకు అంటారా.. తాజాగా కేరళ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు ఇచ్చింది. మహిళలు, యువతులపై జరుగుతున్న దాడుల్లో రాత్రిపూట వారికి స్వేచ్ఛను ఇవ్వడం వల్లే అవుతున్నాయన్న వాదనను తప్పుపట్టింది. అందుకు సంబంధించిన వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. అబ్చాయిలతో పాటు అమ్మాయిలకూ రాత్రి పూట స్వేచ్ఛ ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. కేవలం అమ్మాయిలు లేదా మహిళలు మాత్రమే రాత్రిపూట తిరిగేందుకు ఎందుకు ఆంక్షల చట్రంలో ఇరుక్కుంటున్నారని కేరళ హైకోర్టు ప్రశ్నించింది. అబ్బాయిలు లేదా పురుషులకు ఇచ్చినంత స్వేచ్ఛను వారికి ఎందుకు ఇవ్వలేక పోతున్నామని నిలదీసింది. వెంటనే అందరినీ సమానంగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాత్రిపూట భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ చీకటి పడిన తర్వాత బయటకు వెళ్లడం సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం చూసుకోవాలని జస్టిస్ దేవన్ రామచంద్రన్ అన్నారు.

ఉన్నత విద్యా సంస్థలలోని హాస్టల్ లో రాకపోకలను రాత్రి 9.30 గంటల తర్వాత నియంత్రించే 2019 ప్రభుత్వ ఉత్తర్వును సవాలు చేస్తూ కోజికోడ్ మెడికల్ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థినులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈ కామెంట్లు చేసింది. కేసు విచారణ సందర్భంగా కోర్టు, కేవలం మహిళలు లేదా బాలికలకు మాత్రమే నియంత్రణ అవసరమని.. అబ్బాయిలు లేదా పురుషులు కాదని ఎలా నిర్ణయిస్తారని నిలదీసింది. ఆడపిల్లలు కూడా ఈ సమాజంలో జీవిస్తున్నారు. వారికి భద్రత ఇవ్వాలి. అంతేగానీ ఆంక్షలు విధించడం సరికాదు. క్యాంపస్‌ను సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని హై కోర్టు స్పష్టం చేసింది.

మహిళలు, బాలికల తల్లిదండ్రుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటున్నామని, అయితే అదే సమయంలో రాష్ట్రంలో ఇతర హాస్టళ్లు ఉన్నాయని, అక్కడ కర్ఫ్యూలు లేవని కోర్టు పేర్కొంది. రాత్రికి భయపడకుండా అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకూ స్వేచ్ఛ ఇవ్వాలి. స్త్రీలు, బాలికలకు రక్షణ కల్పించే రూపంలో పితృస్వామ్యం స్థానంలో మాతృస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పింది. అయితే..

ఇవి కూడా చదవండి

2019 ప్రభుత్వ ఉత్తర్వులు తమ హాస్టల్‌లో మాత్రమే అమలవుతున్నాయని పిటిషనర్లు వాదించారు. న్యాయం, సమానత్వం, మంచి మనస్సాక్షి దృష్ట్యా ఎటువంటి సమయ పరిమితులు లేకుండా క్యాంపస్ కు అనుబంధంగా ఉన్న రీడింగ్ రూమ్ ను యాక్సెస్ చేయడానికి అనుమతించాలని కోర్టు నుంచి మెడికల్ కాలేజీకి ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. డేటా చోరీ జరుగుతోందంటూ..
గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. డేటా చోరీ జరుగుతోందంటూ..
పవర్‌ ఫుల్‌ డ్యాన్స్‌తో అదరగొట్టిన పోలీస్‌ బాస్‌... వీడియో చూస్తే
పవర్‌ ఫుల్‌ డ్యాన్స్‌తో అదరగొట్టిన పోలీస్‌ బాస్‌... వీడియో చూస్తే
'కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది'..
'కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది'..
రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే.. ఇక ఏ మందుల అవసరం ఉండదు..
రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే.. ఇక ఏ మందుల అవసరం ఉండదు..
ఆర్థరైటిస్ రోగులు ఎండ నుంచి ఇంట్లోకి వచ్చి ఇలా చేయవద్దు.. ..
ఆర్థరైటిస్ రోగులు ఎండ నుంచి ఇంట్లోకి వచ్చి ఇలా చేయవద్దు.. ..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఏఐ ఫీచర్..
వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఏఐ ఫీచర్..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..
పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా.. : విశాల్.
రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా.. : విశాల్.
బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
క్వీన్ ఆఫ్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ గా.. చూస్తే దిమ్మతిరిగాల్సిందే.!
క్వీన్ ఆఫ్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ గా.. చూస్తే దిమ్మతిరిగాల్సిందే.!
వారి మాటలు నమ్మి ఆ తప్పులు చేశాను.. పరిణితి ఆసక్తికర వ్యాఖ్యలు.
వారి మాటలు నమ్మి ఆ తప్పులు చేశాను.. పరిణితి ఆసక్తికర వ్యాఖ్యలు.