Karnataka: 30 ఏళ్ల క్రితమే తన సమాధిని కట్టుకున్నాడు.. 85వ ఏట ఆ సమాధిలోనే..

Karnataka: ఆయనకప్పుడు 55 ఏళ్లు.. తన సమాధిని తానే నిర్మించుకోవాలనుకున్నాడు. తాను చనిపోతే అందులోనే అంత్యక్రియలు చేయాలని..

Karnataka: 30 ఏళ్ల క్రితమే తన సమాధిని కట్టుకున్నాడు.. 85వ ఏట ఆ సమాధిలోనే..
Buriel
Follow us

|

Updated on: Jul 26, 2022 | 9:07 AM

Karnataka: ఆయనకప్పుడు 55 ఏళ్లు.. తన సమాధిని తానే నిర్మించుకోవాలనుకున్నాడు. తాను చనిపోతే అందులోనే అంత్యక్రియలు చేయాలని తన కుటుంబ సభ్యులకు సూచించాడు. అనుకున్నట్లుగానే.. శ్మశాన వాటికలో తన సమాధిని తానే స్వయంగా నిర్మించుకున్నాడు. ఇటీవల ఆయన తన 85వ ఏట ప్రాణాలు కోల్పోయాడు. అయితే, నాటి తన కోరిక మేరకు ఆ వృద్ధుడి అంత్యక్రియలను ఆ సమాధిలోనే చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగర్ తాలూకాలోని నంజేదేవన్‌పూర్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పుట్టనంజప్ప(85) సహజ మరణం పొందారు. అయితే, పుట్టనంజప్ప 30 ఏళ్ల క్రితమే తన సమాధిని నిర్మించుకున్నారు. సమాధిని సిమెంటు, ఇటుకతో తనకు నచ్చిన రీతిలో నిర్మించుకున్నాడు. అతని కోరిక మేరకు నేడు పుట్టనాంజప్ప అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. పుట్టనంజప్పకు ముగ్గురు పిల్లలు. పిల్లలు బాధపడకూడదని తన అంత్యక్రియలకు, తిథి పనులకు రూ.లక్ష నగదు ముందుగానే దాచి పెట్టుకున్నాడు. అంత్యక్రియలకు అవసరమైన పూజా సామగ్రిని కూడా తానే కొనిపెట్టుకున్నాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..