Karnataka Minister: అయోధ్య రామ మందిర నిర్మాణానికి నిధి సేకరణపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు కుమార్ స్వామి, సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యాలను రాష్ట్ర మంత్రి కేఎస్ ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు. ఈశ్వరయ్య శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి సిద్ధరామయ్య ఒకరే చాలన్నారు. అదే విధంగా జేడీఎస్‌ను కుమారస్వామి నాశనం చేస్తున్నారని అన్నారు. పేదలు సైతం రామాలయం నిర్మాణం కోసం భక్తి భావంతో రూ.10 ఇస్తున్నారని, ఇది వివాద స్థలమని, తాను విరాళం ఇవ్వబోనని సిద్దరామయ్య అంటున్నారని అన్నారు.
కాగా, అంతకు ముందు సిద్దరామయ్య మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. రామ మందిర నిర్మాణం కోసం సేకరించిన బ్యాంకు ఖాతాల సమాచారాన్ని వెల్లడించాలని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ను డిమాండ్ చేశారు. ఇక ఇటీవల కుమారస్వామి మాట్లాడుతూ.. అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం నిధి సేకరణలో పారదర్శకత లేదని, విశ్వహిందూ పరిషత్‌పై మండిపడ్డారు.
Also Read: Metro Rail: మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. భారీగా తగ్గిన మెట్రో ఛార్జీలు.. టికెట్‌పై రూ.20 తగ్గింపు