Karnataka Lockdown: యడియూరప్ప ప్రభుత్వం కీలక నిర్ణయం.. కర్ణాటకలో లాక్‌డౌన్.. ఎప్పటినుంచంటే?

Lockdown in Karnataka - BS Yediyurappa: దేశంలో కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఈ క్రమంలో రోజూవారి కేసుల సంఖ్య నాలుగు లక్షలకుపైగా నమోదవుతుండగా.. వేలాది మరణాలు

Karnataka Lockdown: యడియూరప్ప ప్రభుత్వం కీలక నిర్ణయం.. కర్ణాటకలో లాక్‌డౌన్.. ఎప్పటినుంచంటే?
lockdown
Follow us

|

Updated on: May 07, 2021 | 8:43 PM

Lockdown in Karnataka – BS Yediyurappa: దేశంలో కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఈ క్రమంలో రోజూవారి కేసుల సంఖ్య నాలుగు లక్షలకుపైగా నమోదవుతుండగా.. వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఈక్రమంలో పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ, లాక్‌డౌన్ విధించి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా లాక్‌డౌన్ అమలు చేస్తున్న రాష్ట్రాల్లో కర్ణాటక కూడా చేరింది. రాష్ట్రంలో కఠిన ఆంక్షలు విధించినప్పటికీ కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో లాక్‌డౌన్ విధించాలని కర్ణాటకలోని యడియూరప్ప ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి 14 రోజులపాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్ ప్రకటించారు. కరోనా కర్ఫ్యూ విఫలం కావడం వల్లే లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప వెల్లడించారు.

రాష్ట్రంలో కరోనా కర్ఫ్యూ విధించినప్పటికీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయని, కర్ఫ్యూ విజయవంతం కాకపోవడంతో లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ లాక్‌డౌన్ (ఈ నెల 10న) సోమవారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమవుతుందని.. కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయని యడియూరప్ప తెలిపారు. కాగా.. ఉదయం మీడియాతో మాట్లాడిన యడియూరప్ప రెండురోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. కానీ సాయంత్రం నాటికే తన నిర్ణయాన్ని వెల్లడించడం గమనార్హం. కాగా రాష్ట్రంలో 50వేలకు చేరువలో కేసులు నమోదయ్యాయి.

లాక్‌డౌన్ సందర్భంగా కర్ణాటక వ్యాప్తంగా అన్ని హోటళ్లు, పబ్‌లు, బార్లు మూతపడనున్నాయి. మాంసం, కూరగాయల దుకాణాలు, పలు షాపులకు ఉదయం వేల తెరిచిఉంచనున్నారు. లాక్‌డౌన్ కాలంలో మెడికల్, ఎమర్జెన్సీ వాహనాలను మాత్రమే అనుమతించనున్నట్టు యడియూరప్ప స్పష్టంచేశారు.

Also Read:

CoWin app: వ్యాక్సిన్ వేయించుకోవాలంటే.. నాలుగు అంకెల కోడ్ చెప్పాల్సిందే.. ‘కోవిన్’ యాప్‌లో సరికొత్త ఫీచర్

వెల్లుల్లితో కరోనాకు చెక్..? అన్ని లక్షణాలకు ఇందులోనే మందు..! మీరూ ట్రై చేయండి..