Family Disputes: మద్యం మత్తులో రెచ్చిపోయిన భర్త.. అడ్డు వచ్చిందని భార్య ముక్కును కొరికేశాడు..!

Karnataka: కర్ణాటకలోని హూబ్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తాగిన మత్తులో తన భార్య ముక్కును అతిదారుణంగా కొరికాడు...

Family Disputes: మద్యం మత్తులో రెచ్చిపోయిన భర్త.. అడ్డు వచ్చిందని భార్య ముక్కును కొరికేశాడు..!
Husband Bites Wife Nose
Follow us

|

Updated on: Jul 11, 2021 | 5:13 PM

Karnataka: కర్ణాటకలోని హూబ్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తాగిన మత్తులో తన భార్య ముక్కును అతిదారుణంగా కొరికాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం జిల్లాలోని వాలివాడ గ్రామానికి చెందిన ఉమేష్‌కు, ధార్వాడ్ తాలూకాలో అమ్మినాబావి గ్రామానికి చెందిన గీతకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిద్దరూ కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, ఉమేష్ మద్యానికి బానిస అయ్యాడు. రోజూ తాగి వచ్చి తన భార్య గీతను అనుమానించే వాడు. అలా ప్రతీ రోజూ తాగివచ్చి గీతతో ఘర్షణకు దిగేవాడు. ఈ క్రమంలో భార్యతో గొడవ పడే ఐదేళ్ల క్రితం గీతను తన పుట్టింటికి పంపించాడు. అయితే, తాజాగా ఆరు నెలల క్రితం తిరిగి గీతను తన ఇంటికి తీసుకువచ్చాడు ఉమేష్. కానీ, అతనిలో మార్పు రాలేదు. ఎప్పటిలాగే తాగి గొడవ పడటం, కొట్టడం చేస్తుండేవాడు. దీంతో అతని వేధింపులు తాళలేక గీత మళ్లీ తన పుట్టింటికి వెళ్లిపోయింది.

అయితే, తాజాగా గీతను తిరిగి ఇంటికి తీసుకువచ్చేందుకు ఉమేష్ అమ్మినబావికి వెళ్లాడు. కానీ, అప్పటికే ఫుల్లుగా తాగిన ఉమేష్.. తన భార్య గీతతో, ఆమె తల్లితో వాగ్వాదానికి దిగాడు. నిత్యం తాగి వస్తాడని, అతనితో వెళ్లేందుకు గీత నిరాకరించింది. గీత తల్లి కూడా తన కూతురుని పంపించేది లేదని తేల్చి చెప్పింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఉమేష్.. గీత తల్లిపై దాడికి పాల్పడ్డాడు. అడ్డువచ్చిన గీత ముక్కును దారుణంగా కొరికాడు. దీంతో గీత, ఆమె తల్లి పెద్ద పెట్టున కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు. అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. ఉమేష్ అక్కడి నుంచి పారిపోయాడు. కాగా, తీవ్రంగా గాయపడిన గీతను హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Viral Video: ఎండకు తట్టుకోలేకపోయిన ఎలుగుబంటి.. ఐస్ గడ్డను చూసి ఏం చేసిందంటే.. వైరల్ అవుతన్న ఫన్నీ వీడియో..!

Cell Tower: కృష్ణా జిల్లాలో విచ్చలవిడిగా సెల్ టవర్లు.. మొత్తం ఎన్ని టవర్లున్నాయో తెలిస్తే షాక్ అవుతారు..!

Hilarious Video: వర్క్ ఫ్రమ్ హోంలో అమ్మ హడావుడి.. నెట్టింట్లో రచ్చ చేస్తోన్న చిన్నారి క్రేజీ వీడియో..