Punjab: ముదురుతున్న పంజాబ్ సీఏం భగవంత్ మాన్ వివాదం.. స్పందించిన కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా..

మద్యం తాగి ఉండటంతో పంజాబ్ సీఏం భగవంత్ మాన్ ను జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ విమానశ్రయంలో విమానం నుంచి దించివేశారన్న ఘటన మరింత ముదురుతోంది. ఈఘటనపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటూ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్‌ సహా మరిన్ని పార్టీలు కోరుతూ..

Punjab: ముదురుతున్న పంజాబ్ సీఏం భగవంత్ మాన్ వివాదం.. స్పందించిన కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా..
Bhagwant Mann And Jyotiradi
Follow us

|

Updated on: Sep 21, 2022 | 7:44 AM

Punjab: మద్యం తాగి ఉండటంతో పంజాబ్ సీఏం భగవంత్ మాన్ ను జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ విమానశ్రయంలో విమానం నుంచి దించివేశారన్న ఘటన మరింత ముదురుతోంది. ఈఘటనపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటూ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్‌ సహా మరిన్ని పార్టీలు కోరుతూ వస్తున్నాయి. భగవంత్ మాన్ పంజాబీల పరువును తీసేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం అలాంటి ఘటన ఏమి లేదని, తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడుతోంది. ఈక్రమంలో కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎట్టకేలకు స్పందించారు. ఈ వ్యవహారం విదేశీ భూభాగంపై చోటుచేసుకుందని, ఈ నేపథ్యంలో వాస్తవాలను నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి సంబంధించిన వివరాలు అందజేయడం ‘లుఫ్తాన్సా’ విమానయాన సంస్థ పై ఆధారపడి ఉంటుందన్నారు. తనకు వచ్చిన అభ్యర్థనల ఆధారంగా ఈఘటనపై విచారణను పరిశీలిస్తామన్నారు. మరోవైపు శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షులు సుఖ్ బీర్ సింగ్ బాదల్ ఈఘటనపై ఘాటుగా స్పందించారు. సీఏం భగవంత్ మాన్ ప్రవర్తన వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న పంజాబీలు ఇబ్బందిపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. భగవంత్ మాన్ తాగి లేరని, ఆయనను విమానం నుంచి డీబోర్డింగ్ చేయలేదనే విషయాన్ని విమానయాన సంస్థ లుఫ్తాన్సా చెప్పలేదని, అక్కడి చట్టాలను ఉటంకిస్తూ కేవలం ప్రయాణికుల వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడానికి నిరాకరించిందనే విషయాన్ని సుఖ్ బీర్ సింగ్ బాదల్ గుర్తుచేశారు. సీఏం భగవంత్ మాన్ ఆరోగ్యం బాగోలేదని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోందని, ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో 2 గంటల పాటు వీఐపీ లాంజ్‌లో హాయిగా గడిపిన తర్వాత ఆకస్మాత్తుగా ఎలా అనారోగ్యానికి గురయ్యారని ప్రశ్నించారు.

ఈఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించడంతో పాటు, భగవంత్ మాన్‌ను తన పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈసంఘటనలో వాస్తవాలను తెలుసుకోవడానికి తాను అదే విమానంలో ఉన్న ఇద్దరు ప్రయాణికులతో మాట్లాడానని.. వారిలో ఒకరు ఫస్ట్ క్లాస్ టికెట్ లో ప్రయాణిస్తున్న పారిశ్రామికవేత్త కాగా, మరొకరు రాజస్థాన్‌కు చెందిన హోటల్ వ్యాపారి బిజినెస్ క్లాస్‌ టికెట్ తో ప్రయాణిస్తున్నారని చెప్పారు. సీఏం భగవంత్ మాన్ విమానంలోకి ప్రవేశించిన తర్వాత మొదటి సీటుపై పడిపోయాడని ఆ ప్రయానీకులు ఇద్దరూ తనకు చెప్పారని సుఖ్ బీర్ సింగ్ బాదల్ తెలిపారు.  భగవంత్ మాన్ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. దీంతో కేంద్రప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన వివరాల కోసం జర్మనీ విమానయాన అధికారులను సంప్రదించనున్నట్లు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. దీంతో లుఫ్తాన్సా విమానయాన సంస్థ నుంచి ఎటువంటి సమాధానం వస్తుందనేది వేచిచూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..