Jyoti Kumari: మరోసారి వార్తల్లోకెక్కిన సైకిల్ గర్ల్ జ్యోతి కుమారి.. నాటి సాహసానికి నేడు గుర్తింపునిచ్చిన బిహార్ ప్రభుత్వం..

Jyoti Kumari: మీకు జ్యోతి కుమారి తెలుసా? ఏ జ్యోతి కుమారి అంటారా? అలాగే అంటారులేండి.. ఉత్త జ్యోతి కుమారి అని చెబితే మీరెలా గుర్తుపడతారు.

Jyoti Kumari: మరోసారి వార్తల్లోకెక్కిన సైకిల్ గర్ల్ జ్యోతి కుమారి.. నాటి సాహసానికి నేడు గుర్తింపునిచ్చిన బిహార్ ప్రభుత్వం..
Follow us

|

Updated on: Jan 16, 2021 | 3:17 PM

Jyoti Kumari: మీకు జ్యోతి కుమారి తెలుసా? ఏ జ్యోతి కుమారి అంటారా? అలాగే అంటారులేండి.. ఉత్త జ్యోతి కుమారి అని చెబితే మీరెలా గుర్తుపడతారు. పోనీ సైకిల్ జ్యోతి కుమారి గుర్తుందా? హా.. ఇప్పుడు పక్కా గుర్తొచ్చి ఉంటది. కరోనా కష్ట కాలంలో అనారోగ్యం బారిన పడిన తండ్రిని సైకిల్ మీద ఎక్కించుకుని ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 1200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సంచలనం సృష్టించింది 15 ఏళ్ల జ్యోతి. బతుకుదెరువు కోసం హర్యానాకు వెళ్లగా.. కరోనా వారి బతుకులను చిన్నాబిన్నం చేసింది. దాంతో జ్యోతి కుమారి తన తండ్రిని సైకిల్‌పై ఎక్కించుకుని హర్యానాలోని గురుగ్రామ్‌ నుంచి ఏడురోజుల పాటు ప్రయాణించి బిహార్‌లోని స్వస్థలానికి చేరుకుంది. మరి అలాంటి జ్యోతిని అంత త్వరగా ఎలా మరిచిపోతాం. అయితే తాజాగా మరోసారి జ్యోతి వార్తల్లో టాప్‌గా నిలిచింది.

ఈ సారి బిహార్ ప్రభుత్వం ఆమెకు అరుదైన గుర్తింపునిచ్చింది. ‘కంప్లీట్ స్టాప్ అన్ డ్రగ్స్’ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా జ్యోతిని నియమిస్తూ బిహార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సోషల్ సెక్యూరిటీ డైరెక్టర్ దయానిధన్ పాండే ధృవీకరించారు. ఈ సందర్భంగా జ్యోతిని ఘనంగా సన్మించారు. దాంతో పాటు.. ఆమెకు రూ. 50వేల చెక్కును ఒక ట్యాబ్‌ను ప్రదానం చేశారు. జ్యోతి ఎంతో సహసి అని కితాబిచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని సైకిల్ మీద కూర్చొబెట్టుకుని స్వగ్రామం వరకు తీసుకువచ్చిన ధీర వనిత అని కీర్తించారు. ఆ కారణంగానే ఆమె సాహసాన్ని గుర్తించి.. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు ఆయన తెలిపారు. జ్యోతి యువతరానికి స్ఫూర్తిగా నిలిస్తుందని అన్నారు.

Also read:

actress Deepika padukone: హీరోయిన్ దీపికా పదుకొనెకు ఇష్టమైన సౌత్ ఇండియన్ వంట ఇదేనంటా.. వీడియో వైరల్..

ఎందరో యువ వ్యాపారవేత్తల వేదిక ‘ప్రారంభ్’.. స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్న ప్రధాని మోదీ

పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్