Crocodile: చేపల కోసం వల వేశాడు.. కానీ ముసలి చిక్కింది.. చివరికి..

చేపల వేటకు వెళ్లిన మత్య్సకారుల వలకు చేపలకు బదులు మరోటి చిక్కింది. వల బరువుగా ఉండడంతో పెద్ద చేప పడిందని అనుకున్న మత్య్సకారులు వలను బయటకు లాగేసారికి అసలు విషయం తెలిసింది...

Crocodile: చేపల కోసం వల వేశాడు.. కానీ ముసలి చిక్కింది.. చివరికి..
Crocodile
Follow us

|

Updated on: Dec 07, 2021 | 9:59 PM

చేపల వేటకు వెళ్లిన మత్య్సకారుల వలకు చేపలకు బదులు మరోటి చిక్కింది. వల బరువుగా ఉండడంతో పెద్ద చేప పడిందని అనుకున్న మత్య్సకారులు వలను బయటకు లాగేసారికి అసలు విషయం తెలిసింది. ఒడిశాలో చేప‌ల వేట‌కు వెళ్లిన ఓ మ‌త్స్యకారుడి వ‌ల‌లో ఏకంగా ఒక మొస‌లి చిక్కింది. భారీ చేపే చిక్కింద‌నుకుని ఆశ‌తో ఆ వ‌ల‌ను పైకి లాగిన జాల‌రి అందులో మొస‌లిని చూసి నిరాశ చెందాడు. ముసలిని చూసిన స్థానికులు వెంట‌నే అట‌వీ అధికారుల‌కు స‌మాచారం ఇవ్వడంతో వాళ్లు దాన్ని తీసుకెళ్లి సుర‌క్షిత ప్రాంతంలో వదిలారు.

ఒడిశాలోని తీరప్రాంత‌మైనా కేంద్రపార జిల్లాకు చెందిన ఓ మ‌త్స్యకారుడు లూనా న‌దిలో చేప‌ల వేట‌కు వెళ్లాడు. న‌దిలో అతను చేప‌ల కోసం వ‌ల వేయ‌గా ఐద‌డుగుల పొడ‌వు ఉన్ మొస‌లి చిక్కింది. వెంటనే బయటకు లాగాడు. కానీ ముసలిని చూసి భయపడిపోయాడు. ఒడ్డుకు వచ్చి.. అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు అక్కడి చేరుకున్న ముసలిని తీసుకెళ్లారు. ఉప్పునీటి మొస‌లి భిట‌ర్క్‎నిక న‌ది నుంచి లూనా న‌దిలోకి ఆహారం కోసం వ‌చ్చి ఉంటద‌ని అట‌వీ అధికారులు భావిస్తున్నారు.

ఒకప్పుడు ఉప్పునీటి మొస‌ళ్ల సంఖ్య తక్కువగా ఉండేదని అట‌వీ అధికారులు చెప్పారు. 1975లో వాటి సంఖ్య కేవ‌లం 96 మాత్రమేన‌ని పేర్కొన్నారు. ఆ త‌ర్వాత క్రమంగా సంర‌క్షణ చర్యలతో వాటి సంఖ్య ఇప్పుడు1,768కి పెరిగిందని తెలిపారు.

Read Also.. UP Elections: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీతో RLD పొత్తు ఖరారు