JP Nadda: ప్రధాని సందేశాన్ని వినండి… రైతుల్లోకి తీసుకెళ్లండి… బీజేపీ శ్రేణులకు జేపీ నడ్డా పిలుపు…

భారత మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ డిసెంబరు 25న రైతులను ఉద్దేశించి వర్చువల్‌ విధానంలో మాట్లాడనున్నారు.

JP Nadda: ప్రధాని సందేశాన్ని వినండి... రైతుల్లోకి తీసుకెళ్లండి... బీజేపీ శ్రేణులకు జేపీ నడ్డా పిలుపు...
Follow us

| Edited By:

Updated on: Dec 24, 2020 | 12:48 PM

భారత మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ డిసెంబరు 25న రైతులను ఉద్దేశించి వర్చువల్‌ విధానంలో మాట్లాడనున్నారు. ఈ విషయమై ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన వెలువరించింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ప్రధాని మాట్లాడనున్న సదస్సులో పాల్గొనాల్సిందిగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను కోరారు. అంతేకాకుండా పార్టీ ఇప్పటికే ప్రజాప్రతినిధులందరికి లెటర్ పంపినట్లు తెలిపారు. ప్రధాని ప్రసంగం వినేందుకు దేశంలోని రైతులను బీజేపీ పార్టీ ఆఫీసులకు ఆహ్వానించాల్సిందిగా క్యాడర్‌ను కోరారు. అంతేకాకుండా రైతుల కోసం కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు రైలు, నీమ్ కోటెడ్ యూరియా, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, ఎంఎస్‌పీ వంటి కార్యక్రమాలను రైతులకు వివరించాలని సూచించారు. పార్టీ ఆఫీస్ బేరర్లను పార్టీ ఆఫీసుల్లో పెద్ద స్ర్కీన్లను ఏర్పాటు చేయాలని తెలిపారు.