ఎన్ఐఏ కేసులో సాక్షిని అత్యంత పాశవికంగా హతమార్చిన దుండగులు..!
జార్ఖండ్‌లోని చత్రాలోని తాండ్వాలోని లెంబువా గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు విష్ణు సావో దారుణ హత్యకు గురయ్యాడు. హంతకులు మొదట అతన్ని ఇంటి నుంచి మాట్లాడాలని తీసుకెళ్లి ఆపై గొంతు కోసి హతమార్చారు. మృతుడు ఎన్‌ఐఏ కేసులో సాక్షిగా కూడా ఉండడం వల్లే ఈ హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

జార్ఖండ్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. చత్రాలో బీజేపీ నేతను దుండగులు అత్యంత పాశవికంగా హతమార్చారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, భారతీయ జనతా పార్టీ నాయకుడు ఒక కేసులో సాక్షిగా ఉన్నాడు. అతన్ని ఇంటి నుంచి తీసుకెళ్లి గొంతు కోసి హత్య చేశారు. ఉగ్రవాదులే హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మొదట నలుగురు వ్యక్తులు అతడిని ఇంటి నుంచి తీసుకెళ్లారు. ఊరి శివారులోకి తీసుకెళ్లి గొంతు కోసి హత్య చేశారని పోలీసులు చెప్పారు. హత్యానంతరం కేసు విచారణ జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
చత్రలోని తాండ్వాలోని లెంబువా గ్రామానికి చెందిన బీజేపీ నేత విష్ణు సావో హత్యకు గురయ్యాడు. హంతకులు మొదట బీజేపీ నాయకుడిని ఇంటి నుంచి తీసుకెళ్లి ఆపై గొంతు కోసి హత్య చేశారు. మృతుడు ఎన్‌ఐఏ కేసులో సాక్షిగా కూడా ఉండడం వల్లే ఈ హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. టీపీసీ తీవ్రవాదులు హత్యకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు ఆరోపించారు. స్థానికలు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు వ్యక్తులు ఉదయం 8 గంటల సమయంలో విష్ణు సావో ఇంటికి వచ్చి తమతో పాటు తీసుకెళ్లారు. ఇంటి నుంచి దాదాపు రెండు మూడు కిలోమీటర్ల దూరం వరకు తీసుకెళ్లి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఎన్ఐఏ కేసులో సాక్షిగా ఉన్నందుకు విష్ణు సావో హత్యకు గురయ్యాడని గ్రామస్తులు భావిస్తున్నారు. టీపీసీ తీవ్రవాదులు తొలుత బీజేపీ నేతను కిడ్నాప్ చేసి, ఆ తర్వాత గొంతు కోసి ఘటనకు పాల్పడ్డారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారుజామున నలుగురు వ్యక్తులు విష్ణు సావ్ ఇంటికి వచ్చారని, అతనిని పికప్ చేసి తమతో తీసుకెళ్లారని ప్రజలు చెప్పారు. కొంతసేపటికి ఇంటికి రెండు మూడు కిలోమీటర్ల దూరంలో మృతదేహం లభ్యమైంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..