కరోనా టెన్షన్.. పొగాకు ఉత్పత్తుల వినియోగంపై నిషేధం..

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జార్ఖండ్‌ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని బహిరంగ ప్రదేశాల్లో పొగాకు సంబంధిత ఉత్పత్తుల వినియోగంపై నిషేధాన్ని విధించింది.

  • Tv9 Telugu
  • Publish Date - 7:36 pm, Thu, 18 June 20
కరోనా టెన్షన్.. పొగాకు ఉత్పత్తుల వినియోగంపై నిషేధం..

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జార్ఖండ్‌ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలోని బహిరంగ ప్రదేశాల్లో పొగాకు సంబంధిత ఉత్పత్తుల వినియోగంపై నిషేధాన్ని విధించింది. ఎవరైనా అతిక్రమిస్తే.. భారీగా జరిమానాతో పాటు.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చిరికలు జారీ చేసింది. దీనికి సంబంధించి గురువారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో పొగాకు సంబంధిత ఉత్పత్తుల వినియోగంపై నిషేధం విధిస్తున్నామని పేర్కొంది. సిగరెట్, బీడీ, హుక్కా, గుట్కా, పాన్ మసాలా, ఖైనీ వంటివి బహిరంగ ప్రదేశాల్లో వినియోగిస్తే.. భారీ జరిమానాలతో పాటు.. కఠిన శిక్షలు విధిస్తామని అధికారులు తెలిపారు. అంతేకాదు.. సెక్షన్‌ 188తో పాటు.. 268,269 అండ్ 270 ఐపీసీ సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.