మరో రాష్ట్రానికి మోగిన ఎన్నికల నగారా

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నెల రోజులు కూడా గడవకముందే.. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిచింది ఎన్నికల కమిషన్. ఇవాళ సాయంత్రం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ సునీల్ అరోరా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించారు. దీంతో నేటి నుంచే అక్కడ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. 81 స్థానాలు ఉన్న జార్ఖండ్ రాష్ట్రానికి మొత్తం ఐదు విడతల్లో.. ఎన్నికలు నిర్వహించనున్నట్టు సునీల్ అరోరా వెల్లడించారు. ఈ […]

మరో రాష్ట్రానికి మోగిన ఎన్నికల నగారా
Follow us

| Edited By:

Updated on: Nov 22, 2019 | 6:28 PM

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ముగిసి నెల రోజులు కూడా గడవకముందే.. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిచింది ఎన్నికల కమిషన్. ఇవాళ సాయంత్రం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ సునీల్ అరోరా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించారు. దీంతో నేటి నుంచే అక్కడ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. 81 స్థానాలు ఉన్న జార్ఖండ్ రాష్ట్రానికి మొత్తం ఐదు విడతల్లో.. ఎన్నికలు నిర్వహించనున్నట్టు సునీల్ అరోరా వెల్లడించారు. ఈ నెల 30న ఫస్ట్ ఫేస్ పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 7, 12, 16, 20 తేదీల్లో వరుసగా సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫైనల్ ఫేస్ పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత డిసెంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. జనవరి 5వ తేదీతో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగుస్తుంది.

ప్రస్తుతం ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. 2014లో జరిగిన అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 37 స్థానాల్లో గెలవగా.. బీజేపీ భాగస్వామ్య పక్షమైన ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ) 5స్థానాలను కైవసం చేసుకుంది. 81 మంది సభ్యుల అసెంబ్లీలో మెజారిటీకి అవరమైన 41 మంది సభ్యుల బలం దాటడంతో బీజేపీ సర్కార్ ఏర్పాటైంది. ఆ తర్వాత జార్ఖాండ్ వికాస్ మోర్చా-ప్రజాతాంత్రిక్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా కాషాయ గూటికి చేరడంతో.. అయిదేళ్లు సమర్ధవంతంగా పాలనకొనసాగింది. అయితే ఇప్పుడు మరోసారి కమల దళం అధికారం చేపట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.