Jammu & Kashmir: వీరి సాహసానికి సలామ్.. ఇద్దరు ఉగ్రవాదులను పట్టించారు..!

Jammu & Kashmir: జమ్మూ కశ్మీర్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కరుడుగట్టి ఇద్దరు ఉగ్రవాదులను చాకచక్యంగా పోలీసులకు పట్టించారు..

Jammu & Kashmir: వీరి సాహసానికి సలామ్.. ఇద్దరు ఉగ్రవాదులను పట్టించారు..!
Terrorist
Shiva Prajapati

|

Jul 03, 2022 | 4:55 PM

Jammu & Kashmir: జమ్మూ కశ్మీర్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కరుడుగట్టి ఇద్దరు ఉగ్రవాదులను చాకచక్యంగా పోలీసులకు పట్టించారు పోలీసులు. పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదులు లష్కర్ ఇ తోయిబా గ్రూపును చెందిన వారిగా పోలీసులు వెల్లడించారు. కాగా, ఉగ్రవాదులను పట్టించిన గ్రామస్తులను రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్, డీజీపీ అభినందించారు. లెఫ్టినెంట్ గవర్నర్ రూ. 5 లక్షలు, డీజీపీ రూ. 2 లక్షలు బహుమతి ప్రకటించారు. అలాగే భారీ నజరానా ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లాల్లోని తుక్సన్ గ్రామంలో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు బస చేస్తున్నారు. అయితే, ఉగ్రవాదులను గుర్తించిన గ్రామస్తులు.. చాలా జాగ్రత్తగా, ఎంతో ధైర్యంతో వారిద్దరు ఉగ్రవాదులను పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఉగ్రవాదులిద్దరూ తాలిబ్ హుస్సేన్, ఫైజల్ అహ్మద్‌గా గుర్తించారు పోలీసులు. కాగా, వీరిద్దరి నుంచి రెండు గన్‌లు, ఏడు గ్రెనేడ్స్, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

Guns

Guns

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu