Jammu & Kashmir: మాజీ ఉగ్రవాదిలో ఉప్పొంగిన దేశభక్తి.. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Jan 27, 2023 | 7:19 AM

అతడో కరుడుగట్టి ఉగ్రవాది.. హర్కత్-ఉల్-జిహాద్-అల-ఇస్లామీ(హుజీ) సంస్థలో కీలక వ్యక్తి. భారత్ పేరు వింటే చాలు పగతో రగిలిపోయేవాడు. అవకాశం దొరికితే చాలు ఆయుధం పట్టి..

Jammu & Kashmir: మాజీ ఉగ్రవాదిలో ఉప్పొంగిన దేశభక్తి.. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ..
Terrorist

అతడో కరుడుగట్టి ఉగ్రవాది.. హర్కత్-ఉల్-జిహాద్-అల-ఇస్లామీ(హుజీ) సంస్థలో కీలక వ్యక్తి. భారత్ పేరు వింటే చాలు పగతో రగిలిపోయేవాడు. అవకాశం దొరికితే చాలు ఆయుధం పట్టి అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉంటాడు. కానీ, ఇదంతా ఒకప్పటి ముచ్చట. ఇప్పుడు సీనంతా రివర్స్. ఇప్పుడు అతనినోట ‘మేరా భారత్ మహాన్’ అనే పదమే వినిపిస్తుంటుంది. అవును, హుజీ ఉగ్రవాద సంస్థకు చెందిన మాజీ ఉగ్రవాది షేర్ ఖాన్ చేతిలో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్‌లోని తన నివాసంలో షేర్ ఖాన్ జాతీయ జెండాను ఎగురవేశాడు. ఈ సందర్భంగా మాట్లాడిన ఖాన్.. దేశం కోసం నా జీవితాన్ని అంకితం చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు.

1998 – 2006 మధ్య హుజీ సంస్థలో ఉన్నాడు. భయంకరమైన ఉగ్రవాదిగా పేరుపొందిన షేర్ ఖాన్.. 13 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. చివరకు 2019లో విడుదలయ్యాడు. ప్రస్తుతం తన గతాన్ని వీడి.. జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. షేర్ ఖాన్ తన రెండవ భార్య షహీనా, వారి ఇద్దరు కుమార్తెలు సుమయ్య (19), ఖలీఫా బానో (17)తో నివసిస్తున్నాడు. అయితే, షేర్ ఖాన్ తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మూడేళ్ల క్రితం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రిపబ్లిక్ డే వేడుకలకు మొఘల్ మైదాన్‌కు వెళ్లేవాడినని తెలిపాడు. ఉగ్రవాదిగా ఉన్న సమయంలో తన జీవితమే కాకుండా, తన కుటుంబ సభ్యుల జీవితాలు కూడా నాశనం అయ్యాయని షేర్ ఖాన్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu