Rahul Gandhi: శ్రీనగర్‌‌లోని లాల్‌చౌక్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన రాహుల్‌.. రేపు ముగియనున్న భారత్‌ జోడో యాత్ర

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర కశ్మీర్‌లో తుదిదశకు చేరుకుంది. శ్రీనగర్‌ లోని చారిత్రాత్మక లాల్‌చౌక్‌కు చేరుకున్నారు రాహుల్‌గాంధీ. లాల్‌చౌక్‌ దగ్గర జాతీయ జెండాను ఎగురవేశారు.

Rahul Gandhi: శ్రీనగర్‌‌లోని లాల్‌చౌక్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన రాహుల్‌.. రేపు ముగియనున్న భారత్‌ జోడో యాత్ర
Mp Rahul Gandhi Unfurls The National Flag
Follow us

|

Updated on: Jan 29, 2023 | 12:58 PM

రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర శ్రీనగర్‌కు చేరుకుంది. లాల్ చౌక్‌లో రాహుల్ గాంధీ జెండాను ఎగురవేశారు. అప్పుడు రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక కాశ్మీరీ ప్రజలతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా లాల్ చౌక్ వద్ద మన దేశ జాతీయ జెండా కంటే పెద్దదైన రాహుల్ గాంధీ కటౌట్ కూడా కనిపించింది. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన వెంటనే కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. రాహుల్ గాంధీతో పాటు ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మధ్య వారి యాత్ర సాగుతోంది. లాల్ చౌక్ చుట్టుపక్కల ప్రాంతమంతా దిగ్భందం చేశారు భద్రత అధికారులు. సిటీ సెంటర్ చుట్టూ బహుళ లేయర్డ్ సెక్యూరిటీ కార్డన్ చేయబడింది.

భారీ సంఖ్యలో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాహుల్‌ పాదయాత్ర సందర్భంగా లాల్‌చౌక్‌ ప్రాంతాన్ని భద్రతా బలగాలు సీల్‌ చేశాయి. శ్రీనగర్‌లో సోమవారం భారత్‌ జోడో యాత్ర ముగుస్తుంది. శ్రీనగర్‌లో భారీ సభను ఏర్పాటు చేసింది కాంగ్రెస్‌ పార్టీ . ఈ సభకు దేశం నలుమూలల నుంచి 30 మంది విపక్ష పార్టీల నేతలకు ఆహ్వానాలు అందాయి. టీఎంసీ , సమాజ్‌వాదీ పార్టీ నేతలు ఈ సభకు హాజరుకావడం లేదు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు రాహుల్‌ పాదయాత్ర కొనసాగింది.

కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు..

భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య రాహుల్ గాంధీ లాల్ చౌక్ వద్ద జెండాను ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి, రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ కూడా కనిపించారు. జాతీయ జెండాను ఎగురవేసే సమయానికి స్థానిక ప్రజలు కూడా అక్కడికి చేరుకుని కార్యక్రమంలో పాల్గొన్నారు. కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర జనవరి 30న ముగియనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం

రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..
మితిమీరిన సంబరాలతో అడ్డంగా బుక్కైన ఢిల్లీ పేసర్..!
మితిమీరిన సంబరాలతో అడ్డంగా బుక్కైన ఢిల్లీ పేసర్..!