Corona Virus: భారత్ కు వచ్చే విదేశీ ప్రయాణికులకు ఐసోలేషన్ విషయంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలు..నేటి నుంచి అమలు

Corona Virus-Isolation: విదేశాల నుంచి భారత్ కు వచ్చే ప్రయాణీకుల కోసం కేంద్రం కొన్ని సవరించిన మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల ఐసోలేషన్(Isolation) కు

Corona Virus:    భారత్ కు వచ్చే విదేశీ ప్రయాణికులకు ఐసోలేషన్ విషయంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలు..నేటి నుంచి అమలు
Isolation Not Mandatory For Foreign
Follow us

|

Updated on: Jan 22, 2022 | 7:07 AM

Corona Virus-Isolation: విదేశాల నుంచి భారత్ కు వచ్చే ప్రయాణీకుల కోసం కేంద్రం కొన్ని సవరించిన మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల ఐసోలేషన్(Isolation) కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి భారత్ రాగానే ఎయిర్ పోర్ట్ (Air Port)లో జరిపే కోరనా పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయితే.. గతంలో మాదిరి ఐసోలేషన్ లో ఉండాల్సిన అవసరం లేదంటూ… అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలకు సంబంధించిన మార్గదర్శకాలను సవరిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. అయితే వీరు సాధారణ ప్రోటోకాల్ ను అనుసరించాల్సి ఉంటుందని.. ఈ నియమ నిబంధనలు నేటి నుంచి (January 22) నుంచి అమల్లోకి రానున్నాయని తెలిపింది.

అయితే ఒక్క ఐసోలేషన్ మినహా మిగిలిన నియమాలు, అవసరాలు పాటించాల్సిన జాగ్రత్తలు గతంలో మాదిరిగానే ఉంటాయని పేర్కొంది. నెక్స్ట్ ఉత్తర్వులు వచ్చే వరకు వీటినే అమలు చేయాలని అధికారులకు కేంద్రం సూచించింది. కరోనా వైరస్ ముప్పు ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చిన వారికి కూడా ఈ నిబంధనలే వర్తిస్తాయని ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది.

విదేశాల నుంచి భారత్ కు వచ్చిన ప్రయాణీకులకు ఎయిర్ పోర్ట్ లో జరిపే స్క్రీనింగ్ సమయంలోపాజిటివ్ అని గుర్తించినట్లు అయితే వారి శాంపిల్స్ ను INSACOG లేబొరేటరీ నెట్‌వర్క్‌లో జన్యు పరీక్ష కోసం పంపించాల్సి ఉంటుంది. వెంటనే బాధిత ప్రయాణీకులు నిర్దేశించిన ప్రామాణిక ప్రోటోకాల్ ప్రకారం చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. వెంటనే ఆ ప్రయాణికులు వెంటనే ఐసోలేషన్​కు వెళ్లాలని కొవిడ్​ ప్రొటోకాల్​ చెబుతోంది. అంతేకాదు బాధితుల ప్రైమరీ కాంటాక్ట్​లను కూడా గుర్తించి వారికీ పరీక్షలు నిర్వహించాలి.

భారత్​కు వచ్చిన విదేశీయులు కరోనా పాజిటివ్​ వచ్చిన తరువాత ఏడు రోజులు హోం క్వారెంటైన్​లో ఉండాలి. 8వ రోజు నెగటివ్​ వచ్చిన తరువాత కూడా వారు మరో 7 రోజులు స్వీయ నిర్బంధంలోనే ఉండాల్సి ఉంటుంది. గురువారం విడుదల చేసిన సవరించిన ‘అంతర్జాతీయ ప్రయాణీకుల రాకపోకల మార్గదర్శకాలు’ ప్రకారం ఈ కొత్త నిబంధన జనవరి 22 నుండి తదుపరి ఆర్డర్ వరకు వర్తించనున్నాయి.

Also Read: ఈరోజు ఈ రాశివారు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.. నేటి రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..