Omicron – Vaccine: ఒమిక్రాన్‌ కట్టడికి అవి పని చేయవు.. సహజ ఇమ్యూనిటీయే శ్రీరామ రక్ష: ఐసీఎంఆర్ వైద్య నిపుణులు..

Omicron - Vaccine: కోవిడ్ విజృంభణ నేపథ్యంలో వ్యాక్సీన్ బూస్టర్ డోస్ అంశం ప్రధానంగా వినిపిస్తోంది. చాలా మంది బూస్టర్ డోస్ అవసరం చెబుతున్నారు.

Omicron - Vaccine: ఒమిక్రాన్‌ కట్టడికి అవి పని చేయవు.. సహజ ఇమ్యూనిటీయే శ్రీరామ రక్ష: ఐసీఎంఆర్ వైద్య నిపుణులు..

Omicron – Vaccine: కోవిడ్ విజృంభణ నేపథ్యంలో వ్యాక్సీన్ బూస్టర్ డోస్ అంశం ప్రధానంగా వినిపిస్తోంది. చాలా మంది బూస్టర్ డోస్ అవసరం చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో దేశంలో టాప్ ఎపిడెమియాలజిస్ట్, ICMR NIE సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ డాక్టర్ జయప్రకాష్ ములియిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సైన్స్ ప్రకారం.. ఇన్‌ఫెక్షన్, టీకా రెండూ శరీరంలో నిజమైన T-సెల్ మెమరీని ఉత్పత్తి చేస్తాయి. కావున బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బూస్టర్ షాట్ ఆలోచనే పెద్ద హాస్యాస్పదం అని వ్యాఖ్యానించారు. దీని వల్ల జనాలు ఉపయోగం లేదని, వ్యాక్సీన్ వ్యాపారంలో ఉన్న వారికి మాత్రమే లాభం చేకూరుతుందని చెప్పారు. ‘‘ప్రతిసారీ కొత్త వేరియంట్ వచ్చినప్పుడు, బూస్టర్‌ డోస్ తీసుకోవడానికి తొందరపడతారు. ఇది కంపెనీ మార్కెట్ పెరుగుతుందే తప్ప.. ప్రయోజనం శూన్యం.’’ అని వ్యాఖ్యానించారు. ఇవాళ జాతీయ మీడియాతో మాట్లాడిన డాక్టర్ జయ ప్రకాశ్ కరోనా వ్యాప్తి, బూస్టర్ డోస్ అంశాలపై కీలక విషయాలు చెప్పారు.

భారతదేశంలో నమోదవుతున్నవి డెల్టా కేసులా? ఒమిక్రాన్ కేసులా?.. డెల్టా వైరస్ కేసులు గరిష్ట స్థాయికి వెళ్లాయి. మళ్లీ డౌన్ ఫాల్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు డెల్టా కేసులు తక్కువగా ఉన్నాయి. దక్షిణాఫ్రికా, యూఎస్, యూకే సహా ప్రతి చోటా ఒమిక్రాన్ కేసులే ఎక్కువగా ఉన్నాయి. మేం చేసిన పరిశీలనలో ఈ దేశాలలో కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. గతం కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. కొత్త వేరియంట్ డెల్టాను మించి వ్యాప్తి చెందుతోంది. అయితే, డెల్టా ఇప్పటి వరకు సోకని వారికి సోకే ప్రమాదం ఉంది. కానీ ఆ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. డెల్టా వైరస్ గతంలోనే పీక్స్‌లోకి వెళ్లింది. ఇప్పుడు చాలా తగ్గుముఖం పట్టింది.

డిసెంబరు-జనవరిలో కేసుల పెరుగుదల ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ముంబై, ఢిల్లీలలో ఊహించని రీతిలో కేసులు పెరిగాయి. ఆర్‌టిపీసీఆర్‌లో చాలా మందికి పాజిటివ్ అని తేలింది. అంటే వారందరికీ కోవిడ్ ఉన్నట్లే. అయితే, ఒమిక్రాన్ వేరియంట్‌, ఇతర వేరియంట్ ఏదనేది గుర్తించే సాంకేతికత, స్పెషల్ ల్యాబ్స్ ఇంకా అందుబాటులో లేవు. కావు.. ప్రస్తుతం వస్తున్న కేసులన్నీ ఒమిక్రాన్ గానే భావించాల్సి ఉంటుంది.

ఒమిక్రాన్‌ భయపెడుతుందా? ‘‘అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. కొత్త వేరియంట్‌తో తేలికపాటి లక్షణాలే కనిపిస్తున్నాయి. డెల్టా అంతటి స్థాయిలో ఊపిరితిత్తులకు సోకడం లేదు. ఈ వైరస్ అంత ప్రభావం చూపదు. దీని ఇన్‌ఫెక్షన్ ప్రధానంగా గొంతు, శ్వాసనాళం, ముక్కు వరకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ డెల్టా వల్ల ఎక్కువ న్యుమోనియా, ఊపిరితిత్తుల అల్వియోలీలో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఒమిక్రాన్ ఇంత ప్రభావం చూపకపోవచ్చు. అలా అని ఒమిక్రాన్‌ను తక్కువ అంచనా వేయడం లేదు. జాగ్రత్తగా ఉండటం ఉత్తమం.

ఒమిక్రాన్‌ను తేలికగా తీసుకోవాలా? ప్రస్తుతానికి మనం దేన్నీ తేలికగా తీసుకోలేదు. ఒమిక్రాన్ ఇప్పటికీ విజృంభిస్తోంది. రోజుకు 1 కోటి కేసులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రమే మరణం అంచు వరకు వెళుతున్నారు. చివరి నిమిషంలో ఆస్పత్రిలో చేరడం కూడా మరణాలకు దారి తీస్తోంది. ముందే స్పందిస్తే.. వైరస్ ప్రాణాంతకం కాదు. ముఖ్యంగా వైరస్ సోకిన వారు ధైర్యంగా ఉండాలి.

ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఒమిక్రాన్ కట్టడికి లాక్‌డౌన్, కర్ఫ్యూ వంటి చర్యలు ఏమాత్రం పని చేయవు. నిఫా వంటి అధిక మరణాలు సంభవించే తీవ్రమైన వైరస్ అయితే.. ఇలాంటివి వర్కౌట్ అయ్యేవేమో గానీ, దీని వ్యాప్తి విస్తృతంగా ఉన్న నేపథ్యంలో అలాంటి చర్యలేవీ వైరస్ వ్యాప్తిని నియంత్రించలేవు. స్వీయ సంరక్షణే ఏకైక మార్గం. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం.

ఈ కొత్త వేరియంట్‌తో ఎలా ఎదుర్కోవాలి.. టీకా వేసుకోవడం ద్వారా దీనిని ఎదుర్కోవచ్చు. అలాగే మధుమేహంను అదుపులో ఉంచుకోవాలి. శారీరక వ్యాయామాలు చేస్తుండాలి. ఫిట్‌గా ఉంటే ఎలాంటి సమస్యా రాదు. ఎటువంటి ఇతర వ్యాధులు లేనట్లయితే.. కరోనా సోకినా వెంటనే కోలుకుంటారు. అయితే, ఒమిక్రాన్ వైరస్ మరికొన్ని రోజుల్లోనే తగ్గుముఖం పట్టవచ్చు. వైరస్ పూర్తిగా అంతం అవుతుందో లేదో తెలియదు కానీ, ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండటం ఉత్తమం.

సహజ రోగనిరోధక శక్తి సరిపోతుందా? హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఇన్ఫెక్షన్ ద్వారా ఉత్పత్తి అయ్యే రోగనిరోధక శక్తి. సహజ ఇన్ఫెక్షన్ నుండి వచ్చే రోగనిరోధక శక్తి స్వల్పకాలికంగా ఉంటుందని ఒక అధ్యయనంలో తేల్చారు. ఇది వ్యాక్సీన్ వ్యాపారంలో ఉన్నవారే ఈ విషయాన్ని చెప్పారు. అయితే, ఇన్ఫెక్షన్-ప్రేరిత రోగనిరోధక శక్తి దీర్ఘకాలికంగా ఉంటుందని నా విశ్వాసం. సహజ రోగనిరోధక శక్తి ద్వారా.. ప్లాస్మా కణాలు ఉత్తేజితం కావడం, టీ సెల్స్ ఎక్కువగా ఉత్పత్తి కావడం గమనించాడు. అయినా కూడా యాంటీబాడీస్ పడిపోతున్నాయని ఔషధ కంపెనీలు చెబుతున్నాయి. బూస్టర్ డోస్ పేరును ముందుకు తీసుకువస్తున్నారు.

టీకా వల్ల సహజ రోగనిరోధక శక్తి పనితీరులో మార్పు ఉంటుందా? వ్యాక్సిన్‌ను నేను నమ్ముతాను. టీకా కరోనా నుంచి రక్షిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే, ఇండియాలో చాలా మందికి ఇప్పటికే సహజ ఇన్‌ఫెక్షన్ ద్వారా రోగ నిరోధక శక్తి వచ్చింది. మనలో చాలా మందికి ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలియదు. గత ఏడాది సెరో-సర్వే చేసినప్పుడు, ఆశ్చర్యకరంగా దేశం మొత్తం వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించాము. వాస్తవానికి ఇది మంచి విషయం. ఎందుకంటే ఈ సహజ రోగనిరోధక శక్తి టీకా కంటే గొప్పది రుజువైంది. ఈ లెక్కన ఇప్పటికే అందించిన 150 కోట్లకు పైగా వ్యాక్సిన్‌లు అన్నీ బూస్టర్ షాట్‌లు అని చెప్పాలి.

క్రాస్ ప్రొటెక్షన్ కూడా పని చేస్తుందనే సిద్ధాంతంతో మీరు అంగీకరిస్తారా? ఇంతకు ముందు ఇన్‌ఫెక్షన్ లేదా టీకా ద్వారా పొందిన రోగనిరోధక శక్తి గురించి పెద్దగా పట్టించుకోవద్దని ఓమిక్రాన్‌తో రుజువైంది. ఎందుకంటే వ్యాక్సీన్ తీసుకున్న వారికి కూడా ఇది సోకుతుంది. కానీ ప్రస్తుత సమస్యకు, భవిష్యత్‌లో రాబోయే వేరియంట్‌లకు పరిష్కారం ఉంది. ఇంతకుముందు వైరస్ సోకిన సమయంలో ఏర్పడిన రోగ నిరోధక శక్తి.. మన శరీరంలోకి వచ్చే ఎటువంటి వైరస్‌ను అయినా తరిమి కొట్టగలదు. ఎందుకంటే కరోనాతో ఎలా వ్యవహరించాలో బాడీలోని రక్షణ వ్యవస్థకు తెలుసు. దీనినే క్రాస్ ప్రొటెక్షన్ అంటారు.

Also read:

Career Tips: మీకు అగ్రికల్చర్ సైంటిస్ట్ అవ్వలని ఉందా.. అయితే పూర్తి వివరాలను తెలుసుకోండి

IND VS SA: విరాట్ కోహ్లీ స్పెషల్ రికార్డు.. సెల్యూట్ చేసిన సునీల్ గవాస్కర్.. ఎందుకో తెలుసా?

UPSC Recruitment 2022: అసిస్టెంట్ కమిషనర్‌తో సహా ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.. ఆఖరి తేదీ ఎప్పుడంటే..

Click on your DTH Provider to Add TV9 Telugu