Amit Shah: తమిళ భాషలో ఆ విద్యను అందించండి.. స్టాలిన్ ప్రభుత్వానికి కేంద్ర హోమంత్రి అమిత్ షా హితవు..

తమిళ భాషలో ఇంజినీరింగ్, వైద్య విద్యను అందించాలని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షా తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. తమిళనాడులోని ఓ సిమెంట్ కంపెనీ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిపై ప్రధాని..

Amit Shah: తమిళ భాషలో ఆ విద్యను అందించండి.. స్టాలిన్ ప్రభుత్వానికి కేంద్ర హోమంత్రి అమిత్ షా హితవు..
Amit Shah, Union Home Minister
Follow us

|

Updated on: Nov 13, 2022 | 7:15 AM

తమిళ భాషలో ఇంజినీరింగ్, వైద్య విద్యను అందించాలని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షా తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. తమిళనాడులోని ఓ సిమెంట్ కంపెనీ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. వైద్య, సాంకేతిక విద్యలో బోధనా మాధ్యమంగా తమిళాన్ని ప్రవేశపెట్టాలని తాను తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని అమిత్ షా అన్నారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రయత్నం చేశాయని, దాని ద్వారా విద్యార్థులు ఎన్నో పొందుతున్నారని తెలిపారు.తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం తమిళ భాషలో వైద్య, సాంకేతిక విద్యను అందించడానికి ముందుకొస్తే.. మాతృభాషగా తమిళం విద్యార్థులకు వారి పాఠాలను బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందన్నారు. ప్రపంచంలోని పురాతన భాషలలో తమిళం ఒకటని, తమిళ భాషను పరిరక్షించడం, ప్రోత్సహించడం అందరి బాధ్యత అని అమిత్ షా అన్నారు. ఉన్నత విద్యాకోర్సుల్లో హిందీని బలంవంతంగా రుద్దాలని చూస్తే వ్యతిరేకిస్తామన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. తమిళ భాష ప్రాముఖ్యతను అమిత్ షాసభలో ప్రస్తావించడం ఆసక్తిరేపుతోంది.

తమిళనాడు అభివృద్ధిపై ప్రధానిమోదీ ప్రత్యేక దృష్టి సారించారని, చెన్నై-సేలం, కోయంబత్తూరు, హోసూర్‌లను డిఫెన్స్ కారిడార్‌గా ప్రకటించడం ద్వారా రక్షణ రంగంలో పెట్టుబడులకు కేంద్రప్రభుత్వం అవకాశాలు కల్పించిందని అమిత్‌ షా పేర్కొన్నారు.

భారత్ రానున్న మూడేళ్లలో ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తోందన్నారు అమిత్ షా. పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తోందన్నారు. సామాన్య ప్రజల సొంతింటి కలను సాకారం చేయడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజనను ఒక ఉద్యమంలా చేపట్టామన్నారు. దేశానికి సిమెంట్ తయారీదారుల సహకారాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రశంసించారు. దేశంలో అభివృద్ధి మౌలిక సౌకర్యాల కల్పనపై ఆధారపడి ఉంటే, దానిలో భాగంగా చేపట్టే నిర్మాణాలు సిమెంట్ నాణ్యతపై ఆధారపడి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి, కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి తంగం తెన్నరసు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..
హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..
రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?
రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?
ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..
ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు
తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు
ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..
ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.