
రైళ్లల్లో రద్దీ ఎక్కువై సీట్లే లేనప్పుడు టికెట్లు వెయిట్ లిస్ట్‌లో పడటం అందరూ చూసే ఉంటారు. ఇలాంటప్పుడు టికెట్ కన్పామ్ అవుతుందా..? లేదా? అని చాలామంది ఆందోళన పడుతూ ఉంటారు. ఈ ఆందోళన తొలగించేందుకు ఇప్పటికే చాలా యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో మన టికెట్ పీఎన్‌ఆర్ నెంబర్ టైప్ చేస్తే.. మీ టికెట్ కన్ఫామ్ అవుతుందా..? ఎంతవరకు ఛాన్స్ ఉంది? అనే వివరాలు అందిస్తూ ఉంటారు. అప్పటివరకు ఉన్న డేటాబేస్ ఆధారంగా ఈ యాప్‌లు అంచనా వేస్తాయి. అయితే కొన్ని సమయాల్లో ఇందులు ఖచ్చితమైన అంచనా రాకపోవచ్చు. వారు అంచనాలు తలక్రిందులై మీ టికెట్ కన్ఫామ్ కాకపోవచ్చు. ఒక్కోసారి కన్ఫామ్ కూడా అవ్వోచ్చు. అందుకే ఈ సమస్యను తొలగించేందుకు రైల్వేశాఖ వెయిటింగ్ టికెట్లపై గణాంకాలు, నియమాలను విడుదల చేశాయ. దీని ద్వారా టికెట్ కన్ఫామ్ అవుతుందో..? లేదో? మీరే అంచనా వేయవచ్చు.
ఏ క్లాస్‌లోనూ మొత్తం సీట్లలో వెయిటింగ్ టికెట్లు 25 శాతానికి మంచి ఉండొద్దని రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేశాయి. అంటే ఒక కోచ్‌లో 100 సీట్లు ఉంటే.. వెయిటింగ్ లిస్ట్ 25 సీట్లు మాత్రమే పరిమితం చేయాలి. దీని వల్ల వెయిటింగ్ లిస్ట్ తగ్గడంతో పాటు ప్రయాణికులకు టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక స్లీపర్ కోచ్‌లో మొత్తం 72 సీట్లు ఉంటాయి. రద్దు చేసుకోవడం, అత్యవసర కోటా కింద 25 శాతం సీట్లు ఖాళీగా మారొచ్చు. అంటే దాదాపు 18 సీట్లు ఖాళీ అవుతాయి. దీని ప్రకారం స్లీపర్ కోచ్‌లో 18 వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కన్ఫర్మేషన్ అయ్యే అవకాశముంది.
సగటున దాదాపు 21 శాతం మంది ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకుని రద్దు చేసుకుంటున్నారు. ఇక టికెట్ బుక్ చేసుకున్నవారిలో 4 నుంచి 5 శాతం మంది రైలు ఎక్కడం లేదు. ఇక అత్యవసర కోటా చాలా సమయాల్లో పూర్తి అవ్వడం లేదు. దీంతో ఈ కోటా వెయిటింగ్ లిస్ట్‌గా మార్చుతారు. మొత్తం సీట్లలో 25 శాతం ఖాళీగా మారే అవకాశముంది. దీనిని బట్టి మీ టికెట్ కన్ఫామ్ అవుతుందో.. లేదో మీరే లెక్కులు వేసుకోవచ్చన్నమాట.