Russia-Ukraine war: వేగంగా ఆపరేషన్ గంగా.. ఇప్పటి వరకు భారత్ చేరుకున్నది ఎంత మందో తెలుసా..

ఆపరేషన్‌ గంగను వేగవంతం చేసింది కేంద్రం. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు యుద్దప్రాతిపదికన జరుగుతోంది. తాజాగా బుఖారెస్ట్‌ నుంచి ఎయిర్‌ఇండియా విమానంలో..

Russia-Ukraine war: వేగంగా ఆపరేషన్ గంగా.. ఇప్పటి వరకు భారత్ చేరుకున్నది ఎంత మందో తెలుసా..
Operation Ganga
Follow us

|

Updated on: Feb 27, 2022 | 9:31 PM

యుద్దంతో తల్లడిల్లిపోతున్న ఉక్రెయిన్‌(Ukraine) నుంచి భారతీయుల(Indians) తరలింపు వేగంగా జరుగుతోంది. ఎయిర్‌ఇండియా విమానంలో(air india) మరో 198 మంది స్వదేశానికి చేరుకున్నారు. ఆపరేషన్‌ గంగను(Operation Ganga) వేగవంతం చేసింది కేంద్రం. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపు యుద్దప్రాతిపదికన జరుగుతోంది. తాజాగా బుఖారెస్ట్‌ నుంచి ఎయిర్‌ఇండియా విమానంలో 198 మంది విద్యార్ధులను ఢిల్లీకి తీసుకొచ్చారు. ఇప్పటివరకు నాలుగు విమానాల్లో భారతీయ విద్యార్ధులకు స్వదేశానికి తీసుకొచ్చారు. మంగళవారం నుంచి మరిన్ని విమానాల్లో భారతీయులను తరలిస్తారు. ఉక్రెయిన్‌ నుంచి మరో 21 మంది తెలంగాణ విద్యార్ధులు హైదరాబాద్‌ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి వాళ్లను తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌కు తీసుకొచ్చింది.

ఉక్రెయిన్‌ నుంచి బయటపడే క్రమంలో పోలాండ్‌ సరిహద్దుల్లో భారత విద్యార్ధులకు నరకం కన్పిస్తోంది. శరణార్దులపై పోలాండ్‌ పోలీసులు చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. కొద్దిమందిని కాళ్లతో తన్నారు. గాలిలో కాల్పులు జరుపుతూ బెదిరించారు. పోలాండ్‌ పోలీసుల తీరుపై మండిపడుతున్నారు విద్యార్ధులు.

ఉక్రెయిన్‌ నుంచి వచ్చే భారతీయ విద్యార్ధులకు వీసాలు లేకుండానే అనుమతిస్తామని అంతకుముందు ఉక్రెయిన్‌ ప్రభుత్వం ప్రకటించింది. కాని బోర్డర్‌లో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. ఉక్రెయిన్‌ నుంచి ఒకేసారి లక్షలాదిమంది పోలాండ్‌ సరిహద్దుకు తరలిరావడంతో ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు విదేశాంగశాఖ అధికారులు.

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 908 మంది విద్యార్ధులను ఇప్పటివరకు భారత్‌కు తీసుకొచ్చారు. రష్యా – ఉక్రెయిన్‌ సంక్షోభం ప్రారంభమైన తరువాత 4000 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్టు విదేశాంగశాఖ వెల్లడించింది. ఇంకా 15 వేల మంది భారతీయులు ఉక్రెయిన్‌ లోనే ఉన్నారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ లోనే 2000 మంది భారతీయులు చిక్కుకుపోయారు. అందరిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని విదేశాంగశాఖ వెల్లడించింది.

ఉక్రెయిన్‌లో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా చిక్కుకున్నారు. ఇప్పటివరకు 54 మంది తెలుగు విద్యార్ధులు స్వస్థలాలకు చేరుకున్నారు. అసలు ఉక్రెయిన్‌ నుంచి క్షేమంగా వస్తామని అనుకోలేదని..ప్రభుత్వం తీసుకున్న చర్యలతో క్షేమంగా స్వదేశానికి చేరుకున్నామని హర్షం వ్యక్తం చేస్తున్నారు తెలుగు విద్యార్థులు. కేంద్రం, ఇండియన్‌ ఎంబసీ చాలా త్వరగా రియాక్ట్‌ అయ్యాయని..తమను సేఫ్‌గా భారత్‌కు తీసుకొచ్చారని కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి: National Protein Day: ప్రోటీన్ సమృద్ధికి బూస్టర్.. ఆధునిక సైన్స్‌తో పోషకాహార లోపానికి చెక్ .. 

Defection Case: గోవాలో ఫిరాయింపులపై కాంగ్రెస్ ఫోకస్.. మరో అవకాశం దిశగా ఆ పార్టీ అడుగులు..

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!