బ్రేకింగ్… పంజాబ్లో కుప్పకూలిన మిగ్-29
పంజాబ్ రాష్ట్రంలో భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్ కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన రాష్ట్రంలోని హోషియార్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. రోజు వారీ ట్రైయినింగ్లో భాగంగా మిగ్-29 ఫైటర్ జెట్ విమానం.. జలంధర్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిపోయిందని ఎయిర్ ఫోర్స్ అధికారులు పేర్కొన్నారు. కాగా.. టెక్నికల్ సమస్యల కారణాలతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని.. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. కాగా.. […]
పంజాబ్ రాష్ట్రంలో భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్ కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన రాష్ట్రంలోని హోషియార్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. రోజు వారీ ట్రైయినింగ్లో భాగంగా మిగ్-29 ఫైటర్ జెట్ విమానం.. జలంధర్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిపోయిందని ఎయిర్ ఫోర్స్ అధికారులు పేర్కొన్నారు. కాగా.. టెక్నికల్ సమస్యల కారణాలతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని.. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు.
కాగా.. ఇటీవల మిగ్ 29 విమానాలు తరచూ ప్రమాదానికి గురవుతున్నాయి. ఇప్పటికే పలు విమానాలు టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలాయి.
#UPDATE A MiG-29 fighter aircraft crashed today near Hoshiarpur district of Punjab. The pilot managed to eject safely: IAF officials https://t.co/ybYgQ3hts2
— ANI (@ANI) May 8, 2020