వారం రోజుల్లో ఇండియాలో 15 లక్షలకు చేరిన వ్యాక్సినేషన్లు, 6 గురు హెల్త్ కేర్ వర్కర్ల మృతికి సంబంధం లేదన్న కేంద్రం

ఇండియాలో వ్యాక్సినేషన్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వారం రోజుల్లో ఇవి 15 లక్షలకు పైగా చేరినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నెల 16 నుంచి..

  • Umakanth Rao
  • Publish Date - 10:46 am, Sun, 24 January 21
వారం రోజుల్లో ఇండియాలో 15 లక్షలకు చేరిన వ్యాక్సినేషన్లు, 6 గురు హెల్త్ కేర్ వర్కర్ల మృతికి సంబంధం లేదన్న కేంద్రం

Covid Vaccine: ఇండియాలో వ్యాక్సినేషన్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వారం రోజుల్లో ఇవి 15 లక్షలకు పైగా చేరినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ నెల 16 నుంచి 27,776 సెషన్స్ లో మొత్తం 15.37 లక్షలమంది టీకామందు వేయించుకున్నట్టు ఈ శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజే 3,368 సెషన్స్ లో 1.46 లక్షలమందికి వ్యాక్సిన్ ఇఛ్చినట్టు ఈ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు 1238 మైనర్ (స్వల్ప) అస్వస్థత కేసులు నమోదయ్యాయి. ఆరుగురు హెల్త్ కేర్ వర్కర్లు మరణించారని, అయితే వ్యాక్సినేషన్ కి, వీరి మరణానికి సంబంధం లేదని కేంద్రం తెలిపింది. ఇది మొత్తం వ్యాక్సినేషన్లలో 0.08 శాతం అని వివరించింది. మొదటి రోజున కేవలం 1.9 లక్షలమంది హెల్త్ కేర్ వర్కర్లు టీకామందు తీసుకోగా-వారం రోజుల్లో ఇది మూడున్నర లక్షలకు పెరిగింది. మెల్లగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పుంజుకోవడం ప్రభుత్వ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరగవచ్ఛునని భావిస్తున్నారు.

Also Read:

బ్రేకింగ్ న్యూస్ : ఢిల్లీ ఆకాశవాణి భవన్‌లో అగ్నిప్రమాదం, 8 ఫైరింజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం

యూకేలో జులై 17 వరకు లాక్ డౌన్ పొడిగింపు, విజిటర్లకు 10 రోజుల క్వారంటైన్, ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటన

సౌత్‌ షెట్‌లాండ్‌ ఐలాండ్స్‌లో భూకంపం, రిక్టర్‌ స్కేలుపై 7గా తీవ్రత, సునామీ ప్రమాదం లేదన్న పసిఫిక్‌ హెచ్చరికల కేంద్రం